Vijay, Samantha: ‘ఖుషి’ లో విజయ్- సమంత మధ్య లిప్ లాక్ సన్నివేశాలు..!

విజయ్ దేవరకొండ.. సమంతతో కలిసి ‘మహానటి’ సినిమాలో నటించాడు. సమంత ఆ చిత్రంలో మధురవాణి పాత్రలో నటిస్తే విజయ్ దేవరకొండ .. విజయ్ ఆంటోనీ పాత్రలో నటించాడు. సీరియస్ మోడ్లో సాగుతున్న కథకి వీళ్ళ లవ్ ట్రాక్ రిలీఫ్ ఇస్తూ ఉంటుంది. అయితే వీళ్ళ మధ్య రొమాన్స్ బాగా పండింది ఏమీ లేదు. సమంతను నేను ఇంకా లిప్ లాక్ పెట్టలేదు అంటూ ‘ఆహా’ వారి సామ్ జామ్ షోకి వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

అతని కోరిక ఇంత త్వరగా నెరవేరబోతుందని ఎవ్వరూ ఊహించలేదు. విషయం ఏంటి అంటే.. విజయ్ దేవరకొండ- సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ మూవీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ- సమంత ల మధ్య రొమాంటికి సన్నివేశాలు ఓ రేంజ్లో ఉండబోతున్నాయట. ముఖ్యంగా వీరి మధ్య వచ్చే లిప్ లాక్ సన్నివేశాలు యువతను మంత్రముగ్ధుల్ని చేస్తాయని టాక్. అంతేకాదు ఇంటిమేట్ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత ‘మజిలీ’ చేసింది. ఇక ఈ మధ్య కాలంలో సమంత గ్లామర్ కు ఉన్న హద్దు అదుపులను చెరిపేసిన సంగతి తెలిసిందే.విజయ్ దేవరకొండ సినిమాల్లో కూడా ఇలాంటివి మినిమమ్ ఉంటాయని అందరికీ తెలిసిన సంగతే. రష్మిక, రాశీ ఖన్నాలతో అతను చేసిన రొమాంటిక్ ట్రాక్ లను అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోరు.

అయితే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత లవ్ స్టోరీలు చేయకూడదనుకుంటున్నట్టు విజయ్ దేవరకొండ తెలిపాడు. మళ్ళీ ఇప్పుడు అతను లవ్ స్టోరీల బాట పట్టడం ఏంటి అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus