అదేదో స్పెషల్ డేట్‌లా మొన్నీమధ్య తెలుగు సినిమాల తేదీలు వరుసగా ప్రకటించుకుంటూ వచ్చారు గుర్తుందా. జనవరి 29న జరిగింది ఈ కార్యక్రమం. ఎందుకు ఆ తేదీ ఎంచుకున్నారో తెలియదు కానీ.. టాలీవుడ్‌లో పెద్ద సినిమాల విడుదల తేదీలన్నీ ఆ రోజు బయటకు వచ్చాయ్. అందులో చాలా వరకు ఈ సంవత్సరం విడుదల అయ్యే సినిమాలే ఉన్నాయి. అయితే సర్కారు వారి పాట మాత్రం వచ్చే ఏడాది వస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే సంక్రాంతికి వస్తున్నాం అంటూ పోస్టర్ విడుదల చేశారు. దీంతో నెక్స్ట్ ఇయర్ సినిమా రిలీజ్‌కు ఇప్పుడు పోస్టర్ ఎందుకా అని అందరూ అనుకున్నారు. అయితే దీని వెనుక పెద్ద చర్చే జరిగిందనేది తాజా వార్త.
సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్రబృందం చాలా తర్జనభర్జనలు పడిందట. ఆఖరికి హీరో మాటే నెగ్గి ఆ డేట్‌ను ప్రకటించారని సమాచారం. ఇంతకీ ఏమైందంటే? ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ ఇటీవల మొదలైంది. ఇటీవల దుబాయిలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మహేష్ కాల్‌షీట్లు ఎన్ని ఇచ్చారు, అసలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు వంటి వివరాలైతే బయటకు రాలేదు. కానీ హైదరాబాద్, లండన్‌లో కొన్ని రోజుల చిత్రీకరణ ఉంటుందని మాత్రం తెలుస్తోంది. అయితే ఇది ఇంకా ఫిబ్రవరి కావడంతో, సినిమాను త్వరగా పూర్తి చేసుకొని దసరా సందర్భంగా తీసుకొస్తారేమో అని అభిమానులు ఆశించారు.
అంతేకాదు నిర్మాతలు కూడా అదే అనుకున్నారట. సినిమా విడుదల విషయంలో నిర్మాతల మాట ఒకటైతే, మహేష్ ఆలోచన ఒకలా ఉండిందట. దీంతో మైత్రి వాళ్లు చెప్పిన ఆలోచన అయిన దసరాకు కాకుండా, వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారట. సంక్రాంతి అయితే బాగుంటుందని, సెంటిమెంట్‌గా తనకు సంక్రాంతి సీజన్ కలిసి వస్తోందని మహేష్ అనుకున్నారట. దీంతో నిర్మాతలు సంక్రాంతికి ఓటేశారు. అయితే సరైన తేదీ ఇంకా వెల్లడించలేదు. కేవలం సంక్రాంతికి వస్తాం అని మాత్రమే రిలీజ్ పోస్టర్లో రాసుకొచ్చారు. తేదీ ఇంకెప్పుడు చెబుతారో.
Most Recommended Video
వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!