Love Story Movie: ‘లవ్‌స్టోరీ’ పవన్‌ గురించి తెలుసా?

హీరో కొడుకు హీరో అవుతారు, సంగీత దర్శకుడు కొడుకు మ్యూజిక్‌ డైరక్టర్‌ అవుతారు. ఇలాంటి మూస కాన్సెప్ట్‌లు మనం చాలా రోజుల నుండి వింటూనే ఉన్నాం. అయితే నేనలా కాదు, నా లెక్క వేరు అని చెప్పేవాళ్లు, చేసి చూపించేవాళ్లు చాలామందే ఉంటారు. అలాంటివారిలో యువ సంగీతదర్శకుడు పవన్‌ ఒకరు. ‘లవ్‌స్టోరీ’తో తన సంగీత ప్రవాహంలో యువతను ముంచెత్తిన ఈ సంగీత దర్శకుడి గురించి ఇటీవల కొన్ని విషయాలు తెలిశాయి. పవన్‌ అంటే కొత్త కుర్రాడు అనుకోవచ్చు. కానీ ఆయన కుటుంబం సినిమాల్లో ఎప్పటి నుండో ఉంది.

అలా అని వాళ్ల తండ్రి సంగీత దర్శకుడు కాదు, గాయకుడు కాదు. ఆయన తండ్రి ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ సి.కుమార్‌. ఈ విషయం ఇండస్ట్రీలో కొద్దిమందికి తెలుసు. అయితే ప్రేక్షకులకు మాత్రం మొన్న ‘లవ్‌స్టోరీ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రోజే తెలిసింది. ఈ విషయాన్ని చిరంజీవి చెప్పారు. సంగీత ద‌ర్శ‌కుల విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త వాళ్ల‌తో ప‌ని చేయ‌డం ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌కు అల‌వాటు. చాలా ఏళ్లుగా ఆయన ఇదే పని చేస్తున్నారు. ‘ఆనంద్’, ‘గోదావ‌రి’కి రాధాకృష్ణ‌ పని చేశారు. ఆ రోజుల్లో ఆ పాటలు చార్ట్‌ బస్టర్‌. ‘హ్యాపీడేస్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కి మిక్కీ జేయ‌ర్‌ను తీసుకొచ్చారు.

ఆ పాటల సంగతి ప్రత్యేకంగా చెప్పాలా. ఇక ‘ఫిదా’కు శ‌క్తి కాంత్ అనే యువ దర్శకుడితో పని చేశారు. ఇప్పుడు ‘లవ్‌స్టోరీ’కి పవన్‌. నిజానికి పవన్‌ ‘ఫిదా’ సినిమాకే పని చేయాల్సిందట. అయితే కొన్ని కారణాల వల్ల కుదర్లేదట. అయితే ఇప్పుడు ‘లవ్‌స్టోరీ’తో కుదిరిందట. చెన్నైలో ఓ మ్యూజిక్ కాలేజీలో పవన్‌ గ్రాడ్యుయేష‌న్ చేశాడు. ఆ త‌ర్వాత ఎ.ఆర్.రెహ‌మాన్ ద‌గ్గ‌ర కొన్నేళ్ల పాటు ప‌ని చేశాడు. ‘రోబో’, ‘స‌ర్కార్’, ‘ఫ‌కీర్ ఆఫ్ వెనిస్’ లాంటి చిత్రాల‌కు రెహ‌మాన్ ద‌గ్గ‌ర ప‌ని చేశారు. ఇప్పుడు ‘లవ్‌స్టోరీ’తో మ్యూజిక్‌ డైరక్టర్‌ అవుతున్నాడు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus