ఒకవేళ ఆ హీరో ఈ సినిమా చేసి ఉంటే

కొన్ని సూపర్ హిట్ అయిన సినిమాలను లాస్ట్ మినిట్ లో మిస్ అయ్యాం అని బాధపడుతుంటారు కొందరు కథానాయకులు. నిజానికి ‘ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి’ లాంటి సినిమాలను పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉంది. రీసెంట్ సూపర్ హిట్ అయిన “ఫిదా” కూడా శేఖర్ కమ్ముల ముందు మహేష్ బాబుకు చెప్పాడట. ఒకవేళ మహేష్ ఆ సినిమా సైన్ చేసి ఉంటే “ఫిదా” ఇంకా పెద్ద హిట్ అయ్యుండేది. అయితే.. కొన్నిసార్లు ఒక హీరో వదిలేసిన సినిమా మరో హీరో చేయడం అది పెద్ద ఫ్లాప్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. అలా రీసెంట్ గా జరిగిన చిత్రమే “ఇంటిలిజెంట్”. సాయిధరమ్, వినాయక్ ల కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఈ చిత్రం నిజానికి అక్కినేని నాగచైతన్య చేయాల్సిన సినిమా అంట.

అప్పట్లో నాగచైతన్య-హన్సిక జంటగా “ఢమరుకం” ఫేమ్ శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో “దుర్గ” అనే సినిమా ప్రారంభమై.. ప్రారంభోత్సవం జరుపుకొన్న రెండ్రోజుల్లో ఆగిపోవడం చర్చనీయాంశం అయ్యింది. అదే కథను ఆకుల శివ చిన్న చిన్న మార్పులతో వినాయక్ కి అందిస్తే అదే “ఇంటిలిజెంట్”గా రూపొంది గత శుక్రవారం విడుదలైంది. మరి నాగచైతన్య కథ నచ్చక సినిమాని ప్రారంభ దశలోనే ఆపేశాడా లేక వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ.. ఈ సినిమా చేయనందుకు అక్కినేని అభిమానులు మాత్రం ఆనందంతో మునిగితేలుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus