Actress Anandhi: ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్ ఆనంది!

తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఈరోజుల్లో మూవీ తో తెరంగేట్రం చేసిన తెలుగు అమ్మాయి ఆనంది, ఆ తరువాత బస్ స్టాప్ సినిమాలో నటించింది. యూత్ ని ఆ సినిమాలు బాగానే ఆకట్టుకున్నప్పటికీ నటి ఆనందికి మాత్రం వాటితో ఆశించిన స్థాయి గుర్తింపు అయితే రాలేదు. అనంతరం ఆమె కోలీవుడ్ లో అవకాశాలు కోసం ప్రయత్నాలు చేయడం, ఆ తరువాత అక్కడ వరుసగా మంచి ఛాన్స్ లు అందుకుని వాటితో సక్సెస్ లు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇటీవల తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన జాంబీ రెడ్డి మూవీ ద్వారా మళ్ళి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఆనంది.

ఇక లేటెస్ట్ గా సుధీర్ బాబు కి జోడీగా ఆమె నటించిన మూవీ శ్రీదేవి సోడా సెంటర్. రస్టిక్ లవ్ స్టోరీ డ్రామా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కొన్నాళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. కరుణ కుమార్ తీసిన ఈ సినిమాని 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. ఇక ప్రస్తుతం మూవీ టీమ్ విజయయాత్రలు చేస్తుండగా వారిలో హీరోయిన్ ఆనంది మాత్రం మిస్ అయింది.

అయితే దానికి కారణం ఈ ఏడాది జనవరిలో అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ ని ప్రేమించి వివాహమాడిన ఆనంది ప్రస్తుతం ఆరు నెలల గర్భవతని, అందుకే ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ తో పాటు విజయ యాత్రల్లో కూడా పాల్గొనడం లేదని సమాచారం. కాగా ఈ సినెమా సక్సెస్ తరువాత ప్రస్తుతం ఆనందికి మంచి అవకాశాలు వస్తున్నాయని, ఇప్పటికే ఆమె ఒక యువ హీరో సినిమా అంగీకరించిందని, డెలివరీ అనంతరం ఆమె ఆ సినిమాలో యాక్ట్ చేస్తుందని తెలుస్తోంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus