Vakeel Saab: ‘వకీల్‌సాబ్‌’ ఓటీటీకి తీసుకొచ్చేస్తారా?

  • April 23, 2021 / 04:18 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ని థియేటర్లలో ‘వకీల్‌సాబ్‌’ ఓ ఊపు ఊపుతున్నప్పుడే కరోనా రెండో ఊపు మొదలైంది. అభిమానులు, ప్రేక్షకులు సినిమా చూడటానికి థియేటర్‌ వస్తుండటంతో వసూళ్లు గట్టిగానే కనిపించాయి. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి పెరిగిపోవడంతో సాధారణ ప్రేక్షకుల రాక తగ్గింది. దీంతో సినిమాను ఓటీటీలోకి ఇచ్చేస్తున్నారు అంటూ వార్తలు మొదలయ్యాయి. ఇది సినిమా వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుందేమో అని దిల్‌ రాజు టీమ్‌ స్పందించింది. ‘సినిమా ఇప్పుడే ఓటీటీలోకి రాదు’ అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దీంతో సినిమా ఓటీటీలోకి త్వరగా వచ్చేస్తుందంటున్నారు.

ప్రస్తుతం దేశంలో పరిస్థితులు మారిపోవడంతో సినిమా కొన్ని చోట్ల థియేటర్లలో 50 శాతం ఆక్యపెన్సీ నిబంధన పెట్టారు. మరికొన్ని చోట్ల పూర్తిగా థియేటర్ల మూసేశారు. ఈ పరిస్థితుల్లోనే సినిమా క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలని ఓటీటీలు చూస్తున్నాయి. అందుకే థియేటర్లలో ‘వకీల్‌సాబ్‌’ సృష్టించిన జోరును కొనసాగిస్తూ ఓటీటీలో విడుదల చేసేయాలని నిర్ణయించాయట. అయితే థియేటర్లలో తమ సినిమా ఇంకా ఉందని దిల్‌ రాజు మొన్న అనడంతో ఆగారు. ఇప్పుడు మాత్రం ఆగరట. ఆగనమి దిల్‌ రాజు కూడా చెప్పారట.

ఈ నేపథ్యంలో మే తొలి వారంలోనే ‘వకీల్‌సాబ్‌’ ఓటీటీల్లోకి వచ్చేస్తుందని అంటున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు. అయితే డిజిటల్‌ రైట్స్‌ను జీ5కు దిల్‌ రాజు అమ్మేశారట. కాబట్టి అమెజాన్‌ ప్రైమ్‌తోపాటు జీ5లోనూ సినిమా చూడొచ్చన్నమాట. నిజానికి మే ఆఖరు వారంలో సినిమాను ఓటీటీకి ఇవ్వాలని దిల్‌ రాజు తొలుత అనుకున్నారట.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus