బండ్ల గణేష్ ఫ్యామిలీ కూడా వైరస్ భారిన పడిందా?

ప్రముఖ టాలీవుడ్ నటుడు మరియు నిర్మాత అయిన బండ్ల గణేష్.. క*నా వైరస్ భారిన పడిన సంగతి తెలిసిందే. ‘క*నా వైరస్ సోకిందని కొన్ని లక్షణాల ద్వారా కనిపెట్ట వచ్చు. తుమ్ము,దగ్గు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు… వంటి లక్షణాల వస్తే క*నా కు గురయ్యినట్టే అని… ఆ ఛాయలు ఉంటే కచ్చితంగా హాస్పిటల్ లో జాయిన్ అవ్వాలి’ అని ప్రభుత్వం సూచించింది.అయితే బండ్ల గణేష్ కు అలాంటి లక్షణాలు ఏమీ లేవు.

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కొరకు ఓ క్లినిక్ కు వెళ్లిన బండ్లన్నకు… అక్కడి వైద్యులు మొదట ‘క*నా టెస్ట్ చేయించుకోవాలని’ ఆదేశించడంతో ఆ టెస్ట్ చేయించుకున్నాడట. ఈ క్రమంలో అతనికి క*నా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దాంతో టాలీవుడ్ సెలబ్రిటీలలో క*నా సోకిన మొదటి వ్యక్తి బండ్ల గణేష్ అని తేలింది. దాంతో బండ్ల గణేష్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్ట్స్ లు నిర్వహించారు. అయితే అదృష్టవశాత్తు వాళ్ళందరికీ క*నా నెగిటివ్ వచ్చినట్టు సమాచారం.

మరోపక్క బండ్ల గణేష్ స్టాఫ్ మరియు పర్సనల్ అసిస్టెంట్ లకు కూడ క*నా పరీక్షలు నిర్వహించగా. వారి రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉందని తెలుస్తుంది. ఇక బండ్ల గణేష్ ను ప్రస్తుతం ఐసొలేషన్ వార్డు లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్య నిపుణులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే ‘అతనికి ఎలాంటి ప్రమాదం లేదని..త్వరలోనే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని’ వారు చెప్పుకొస్తున్నారు.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus