Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ కథ మోహన్ బాబు ప్లాప్ సినిమాకు కాపీనా..!

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘భగవంత్ కేసరి’ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి గ్లింప్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. అందులో బాలయ్య చాలా కొత్తగా కనిపించాడు. అతని బాడీ లాంగ్వేజ్ కూడా అభిమానులకు బాగా నచ్చింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా..

శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో కనిపించబోతుంది అని దర్శకుడు అనిల్ రావిపూడి ముందుగానే చెప్పేశాడు. అయితే ఈ చిత్రం కథ ఇదేనంటూ ఏవేవో ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ఈ చిత్రం కథ గతంలో వచ్చిన మోహన్ బాబు ప్లాప్ సినిమాని పోలి ఉంటుంది అని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. గతంలో మోహన్ బాబు హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ‘రాయుడు’ అనే సినిమా వచ్చింది. 1998 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వల్లల్’ అనే సినిమాకి రీమేక్.

ఈ సినిమాలో మోహన్ బాబు గెటప్ అంతా ‘పెదరాయుడు’ సినిమాలో గెటప్ లా ఉంటుంది. టైటిల్ కూడా ఎలాగు సిమిలర్ గా ఉంటుంది. ఇక ‘పెదరాయుడు’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రవిరాజా పినిశెట్టినే ఈ చిత్రానికి దర్శకుడు, హీరోయిన్ గా సౌందర్య కూడా నటించింది. చాలా వరకు ఇది ‘పెదరాయుడు’ కాంబినేషన్లో వచ్చిన మూవీ కాబట్టి.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో మోహన్ బాబుకి కూతురిగా ప్రత్యూష నటించింది.

అయితే క్లైమాక్స్ లో ఆమె మోహన్ బాబు కన్న కూతురు కాదు పెంపుడు కూతురు అంటూ ట్విస్ట్ రివీల్ అవ్వడం, ఫ్లాష్ బ్యాక్ కూడా ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో సినిమా ప్లాప్ అయ్యింది. ఇప్పుడు బాలయ్యతో … అనిల్ చేస్తున్న (Bhagavanth Kesari) ‘భగవంత్ కేసరి’ కూడా అదే లైన్ తో రూపొందుతుందట. క్లైమాక్స్ లో శ్రీలీల.. బాలకృష్ణకి సొంత కూతురు కాదు అనే ట్విస్ట్ రివీల్ అవుతుందట. అయితే ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ చాలా చక్కగా కుదిరాయి అని, తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus