టాలీవుడ్ హీరోల మధ్య ఎంత పోటీ అయినా ఉండొచ్చు.. కానీ ఒక హీరో సినిమా విడుదల అయితే, మరో హీరో ట్వీట్ చేయడం, పర్సనల్‌గా ఫోన్ చేయడం లాంటివి చేస్తుంటారు. అందరూ చేస్తారని కాదని, కొత్త తరం హీరోలు చేస్తుంటారు. సీనియర్ అగ్ర హీరోలు కూడా ఇలా చేసేవారిలో ఉన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల సందర్భంగా ఈ సత్ సంప్రదాయం కనిపించింది. అయితే ఈ విషయంలో బాలీవుడ్ ఎందుకు గమ్మునుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ప్రశ్న.
బాలీవుడ్‌లో ఓ సినిమా విడుదలైతే మన దగ్గరలాగే ఒకరినొకరు అభినందించుకోవడం చూస్తుంటాం. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ విషయానికొచ్చేసరికి ఈ సంప్రదాయం ఎందుకు కనిపించడం లేదు. ఏంటీ ప్రశ్న ఇంత సూటిగా వేసేశాం అనుకుంటున్నారా? మరి బాలీవుడ్ స్టార్‌లు, దర్శకనిర్మాతల వ్యవహారశైలి అలా ఉంది మరి. ‘ఆర్‌ఆర్ఆర్’ సినిమా రూ. 500 కోట్ల వసూళ్లను దాటి, రూ. 750 కోట్లవైపు దూసుకుపోతోంది. ఇంత జరుగుతున్నా, సినిమా పరిశ్రమలో ఏమీ జరగనట్లుగా ఒక్క బాలీవుడ్ ప్రముఖుడు కూడా మాట్లాడటం లేదు.
పేరు కోసం పాకులాడే కమల్ ఆర్ ఖాన్ లాంటి అనలిస్ట్ (?) మాత్రమే సినిమా గురించి స్పందించారు. దుబాయి ఎక్స్‌పోలో రణ్‌వీర్ సింగ్ సినిమా గురించి మాట్లాడాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి వాళ్లు మాట్లాడటమే. మంచి సినిమాను భుజాన వేసుకొని తిరిగినా తప్పులేదంటారు. అలా దేశం మొత్తం గర్వించేలా హాలీవుడ్ సినిమా వసూళ్లతో పోటీ పడుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించి బాలీవుడ్ ఎందుకు మాట్లాడటం లేదు.
పోనీలే రామ్‌చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ బాలీవుడ్ వాళ్లకు తెలియదా అంటే అందరికీ తెలుసు. అంతెందుకు సినిమాలో అజయ్ దేవగణ్, ఆలియా భట్ లాంటివాళ్లు కీలక పాత్రలు పోషించారు కూడా. వారి గురించి కూడా ట్వీట్లు లేవు. అయితే బాలీవుడ్ ప్రముఖులు ట్వీట్లు చేసేస్తే జనాలు సినిమాలు చూసేస్తారు అని కాదు. కానీ మంచి సినిమా ప్రోత్సహించడం ఇండస్ట్రీలో ఉంటే మంచిది కదా అని అభిప్రాయం. అలా అని అన్ని తెలుగు సినిమాలను ప్రోత్సహించమని అడగడం లేదు.
పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ను కూడా అన్ని సినిమాల్లా చూస్తే ఎలా. ఇక్కడే చిన్న ప్రశ్న ఉదయిస్తోంది. ‘పుష్ప’, ‘రాధేశ్యామ్’, ‘ఆర్‌ఆర్ఆర్’.. ఇలా దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా అంటూ బాలీవుడ్‌కి వెళ్లి మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. మరోవైపు ఇదే సమయంలో బాలీవుడ్‌లో సరైన హిట్లు లేవు. కొంపదీసి ఇదేమన్నా వాళ్లకు కంటగింపుగా మారిందా? అన్నట్లు తొలుతు ‘ఆర్‌ఆర్ఆర్’ ఉత్తరాదిలో సరైన వసూళ్లు లేవన్నారు కానీ… ఇప్పుడు వసూళ్లు బాగానే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?