Chiranjeevi: ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓనర్లతో చిరంజీవి… ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లేనా?

ఐపీఎల్‌లో భాగం కావాలి అని మెగా ఫ్యామిలీ చాలా ఏళ్లుగా అనుకుంటోంది అనే టాక్‌ టాలీవుడ్‌లో నడుస్తోంది. రామ్‌చరణ్‌ (Ram Charan) కూడా దీనికి అనుకూలంగా ఓ సందర్భంలో మాట్లాడినట్లు గుర్తు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఓ టీమ్‌ కొనుగోలు చేస్తారని, అవసరమైతే మరొకరితో కలసి టీమ్‌ను దక్కించుకుంటారు అని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పట్లో ఐపీఎల్‌లో జట్ల సంఖ్యను పెంచే ఆలోచన లేదని ఐపీఎల్‌ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో చిరంజీవి (Chiranjeevi) కొత్త ఆలోచన చేశారా?

Chiranjeevi

ఏమో రీసెంట్‌గా ఆయన గురించి బయటకు వచ్చిన ఓ వీడియో చూస్తుంటే ఈ విషయంలో అదే డౌట్‌ వస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE)లో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో భాగంగా శుక్రవారం షార్జాలో దుబాయ్ కేపిటల్స్, షార్జా వారియర్జ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌ చూడటానికి చిరంజీవి వచ్చారు. ఐసీసీ డైరెక్టర్ ముబాషిర్ ఉస్మాని, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ ఛైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధితో కలిసి చిరంజీవి మ్యాచ్‌ను తిలకించారు.

ఈ నేపథ్యంలో చిరంజీవి (Chiranjeevi) ఎందుకు క్రికెట్‌ మ్యాచ్‌ను చూడటానికి వచ్చారు అనేదే ప్రశ్న. గతంలో చిరంజీవి ఇలా మైదానానికి వచ్చి మ్యాచ్‌ చూసిన దాఖలాలు లేవు. మన దేశంలో కూడా యన ఎప్పుడూ ఇలా మైదానానికి వచ్చి మ్యాచ్‌ చూడలేదు. విదేశాల్లో కూడా తక్కువే. అలాంటిది ఆయన ఎందుకు మైదానానికి వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌తో ఉన్నారు అనేదే ఆసక్తికరంగా మారింది.

దిల్లీ క్యాపిటల్స్‌లో చిరంజీవి భాగమవ్వాలని అనుకుంటున్నారని.. ఆ క్రమంలోనే వెళ్లి కలిశారని చెబుతున్నారు. అయితే చిరంజీవి వ్యక్తిగత పర్యటన మేరకు దుబాయిలో వెళ్లారని, ఆయన అక్కడ ఉండటం తెలిసి దిల్లీ క్యాపిటల్స్‌ పిలిచి ఉండొచ్చని టీమ్‌ అంటోంది. కానీ మెగా ఫ్యామిలీ ఇందులో భాగమవుతుందని ఫ్యాన్స్‌ అంటున్నారు. అదే జరిగితే విశాఖపట్నాని సెకండ్‌ హోమ్‌ గ్రౌండ్‌గా ఢిల్లీ టీమ్‌ పెట్టుకుంటుందని, రామ్‌చరణ్‌ ప్రచారం కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు.

‘అమరన్’.. తెలుగులో కూడా ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus