Chiranjeevi: ఆ సినిమాల సంగతి ఏంటి చిరు..?

సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటి స్టార్ హీరోలకి గట్టి పోటీనే ఇస్తున్నారు. 70ఏళ్ళ వయసుకి చేరువవుతున్నప్పటికీ.. ఆయన ఏకంగా 4 సినిమాలను సెట్స్ పై తెచ్చి అందరినీ షాక్ కు గురిచేసారు. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల చిరంజీవి ప్లానింగ్స్ మొత్తం తారుమారు అయ్యాయి. ‘ఆచార్య’ చిత్రం 2020లో విడుదల కావాలి. కానీ 2 ఏళ్ళ నుండీ ఆ చిత్రం షూటింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయి.ఇప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్.

2022 ఫిబ్రవరి 4న విడుదల చేస్తాం అంటున్నారు కానీ ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అది సాధ్యమవుతుందో లేదో చెప్పలేం.’ఆచార్య’ సంగతే ఇలా ఉంటే మరోపక్క చిరు నాలుగు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. మోహన్ రాజ దర్శకత్వంలో ‘గాడ్ ఫాధర్’ చిత్రం షూటింగ్ ను ఆల్రెడీ ఆయన 45శాతం ఫినిష్ చేశారు. ఇంకో నెల రోజుల్లో అది మొత్తం కంప్లీట్ అయ్యే అవాకాశం ఉంది.

అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాలం’ రీమేక్ చేస్తున్నారు. ‘భోళా శంకర్’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఆ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. వీటితో పాటు బాబీ దర్శకత్వంలో ఒక సినిమా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా.. చిరు చేయాల్సి ఉంది. ఇవి ఎప్పటికి పూర్తవుతాయి అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఈ సినిమాలని చిరు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. చిరు ఎప్పుడు ఈ సినిమాల్ని విడుదల చెయ్యాలి అనుకున్నా భారీ పోటీ నడుమ విడుదల చెయ్యాల్సి ఉంటుంది.

అది కూడా వాళ్ళ ఫ్యామిలీ హీరోల సినిమాల మధ్యలోనే దింపాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు. ‘ఆచార్య’ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కనుక పూర్తిచేసి ఉంటే.. ఈ సంక్రాంతికి థియేటర్లలో దింపే అవకాశం ఉండేది. అప్పుడు చిరుకి కొంత రిలీఫ్ దక్కేది. కానీ ఆ ఛాన్స్ మిస్ అయ్యింది కాబట్టి.. ముందు ముందు సానా కష్టమనే చెప్పాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus