Chiranjeevi: మెగాస్టార్ న్యూ ప్రాజెక్ట్.. కథ ఎంతవరకు వచ్చింది?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వశిష్ఠ మల్లిడి (Mallidi Vasishta) దర్శకత్వంలో ‘విశ్వంభర’ (Vishwambhara)  మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ ఫినిష్ అయిపొయింది. 2025 జనవరి 10న ‘విశ్వంభర’ మూవీ రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. అయితే మే నెలకి మూవీ వాయిదా పడింది. ఈ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమాపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. బివిఎస్ రవి (B. V. S. Ravi) గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఒక స్టోరీ లైన్ నేరేట్ చేసాడు.

Chiranjeevi

అది చిరంజీవికి నచ్చడంతో స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టారు. మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో ఈ సినిమా చేయాలని చిరంజీవి ప్లాన్ చేశారు. సుస్మిత కొణెదల (Sushmita Konidela) , టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఈ మూవీ స్క్రిప్ట్ ని బివిఎస్ రవి, మోహన్ రాజా కలిపి డెవలప్ చేసారంట. రీసెంట్ గా ఈ కథని మెగాస్టార్ విన్నారంట. వారు సిద్ధం చేసిన కథ చిరంజీవిని పెద్దగా మెప్పించలేదనే మాట వినిపిస్తోంది. దీంతో ఇంకో వెర్షన్ రెడీ చేయమని చిరంజీవి సూచించారంట.

దీంతో పాటు మరికొంత మంది యువ దర్శకులతో కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కథలపై చిరంజీవి డిస్కస్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బివిఎస్ రవి కథ నుంచి మోహన్ రాజా తప్పుకుని మళ్ళీ వచ్చారంట. కొత్త వెర్షన్ ని సిద్ధం చేసే పనిలో ఇప్పుడు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. వివి వినాయక్ (V. V. Vinayak) పేరుని ఈ సినిమా కోసం పరిశీలించారని సమాచారం. అయితే ఆయన మళ్ళీ వెనక్కి తగ్గారంట. అలాగే హరీష్ శంకర్ (Harish Shankar) పేరు కూడా తెరపైకి వచ్చింది.

వచ్చే ఏడాది కొత్త ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలని చిరంజీవి అనుకుంటున్నారు. ఒక వేళ బివిఎస్ రవి కథ వర్క్ అవుట్ కాకపోతే యువ దర్శకులతో మూవీస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 2025 ఆరంభంలో కచ్చితంగా నెక్స్ట్ మూవీకి సంబందించిన అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. మెగాస్టార్ ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే కథలని చేయాలని అనుకుంటున్నారు. మూస ధోరణిలో ఉండే రెగ్యులర్ కమర్షియల్ కథల నుంచి బయటకి రావాలని భావిస్తున్నారు.

కంగువా.. తెలుగులో 100 కోట్ల ఆశ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus