సినిమా పరిశ్రమ సమస్యల గురించి మాట్లాడుకుందాం రండి… అంటూ ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు సినిమా పెద్దలకు పిలుపునిచ్చారు. దీంతో చాలా కాలంగా ఉన్న సమస్యల్ని ఫిక్స్ చేసుకుందామని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి నివాసంలో ఇటీవల ఓ మీటింగ్ జరిగింది. ఇండస్ట్రీలోని పెద్దలు కొంతమంది ఆ మీటింగ్‌కి వచ్చారు. అయితే ఈ క్రమంలో చిరంజీవి చాలా కీలకమైన విషయమై చర్చించారని భోగట్టా. అంతేకాదు ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఇటు పరిశ్రమకు, అటు ప్రేక్షకులకు నష్టం అని కూడా చెప్పారట.
సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యల్లో థియేటర్ల వ్యవస్థ ఇబ్బందులు కీలకం అని చెప్పొచ్చు. ప్రస్తుతం థియేటర్ వ్యవస్థ ఏ మాత్రం బాగోలేదని, దానిని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని చిరంజీవి జాగ్రత్తల గురించి చర్చించారట. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం థియేటర్లు సురేశ్ బాబు, అల్లు అరవంద్, దిల్ రాజు, సునీల్ నారంగ్ చేతుల్లోనే ఉన్నాయి. థియేటర్లను వాళ్ల చేతుల్లో ఉంచి సినిమాలు విడుదల చేస్తుంటారు. అయితే పరిస్థితుల ఏ మాత్రం సరిగ్గాలేని ఈ సమయంలో ఆ నలుగురు కాస్త పట్టువిడుపులు ప్రదర్శించాలని చిరంజీవి కోరారట. దీంతోపాటు టికెట్ల వ్యవస్థ మీద చిరంజీవి మాట్లాడారని అంటున్నారు.
బుకింగ్‌లో టికెట్లు అమ్మే విధానం నుండి మొత్తంగా ఆన్‌లైన్ వైపునకు అంతా మారిపోతున్నారు. దీని వల్ల సౌలభ్యం ఉన్నప్పటికీ… బుకింగ్ కోసం సర్వీసు ప్రొవైడర్లు సర్వీసు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అలా వసూలు చేసిన డబ్బులు ఇటు థియేటర్లకు, అటు నిర్మాతలకూ చెందడం లేదని చిరంజీవి గుర్తు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సర్వీసు ఛార్జీలను తొలగిస్తే ఎలా ఉంటుందో ఆలోచన చేయాలని సూచించారట చిరంజీవి. దీంతోపాటు కేరళ, తమిళనాడు చలన చిత్ర నిర్మాతల మండళ్ల తరహాలో మన దగ్గర కూడా సొంత ఓటీటీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించే విషయంలో చర్చ జరిగిందని టాక్. చూద్దాం వీటిలో ఏయే విషయాల్లో ఏపీ సీఎం జగన్‌తో చర్చలో వస్తాయో.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!