అజిత్‌.. ధనుష్‌ కాంబినేషన్‌లో సినిమా.. ఈసారి అంతకుమించి..!

‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jaabilamma Neeku Antha Kopama).. అంటూ ఇటీవల దర్శకుడిగా మూడో సినిమా చేశాడు ధనుష్‌ (Dhanush)  . అటు స్టార్‌ హీరోగా వరుస సినిమాలు చేస్తూ వస్తున్న ధనుష్‌ దర్శకుడిగానూ తన సత్తా చాటే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో తన ఐదో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈసారి తన ప్రయత్నం మామూలుగా లేదు. కొడితే కోలీవుడ్‌ వసూళ్ల జోరుతో అల్లాడిపోయే విజయం అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ధనుష్‌ మెగా ఫోన్‌ పట్టి యాక్షన్‌ చెప్పబోయేది తమిళ స్టార్‌ హీరోని కాబట్టి.

Dhanush

ధనుష్‌ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘పవర్ పాండి’. రాజ్‌కిరణ్‌ – రేవతి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఆ సినిమా పెద్ద హిట్. రెండో సినిమా ‘రాయన్’ (Raayan). తమిళంలో పెద్ద హిట్ అయింది. తెలుగులో ఫర్వాలేదు అనిపించింది. ఇక మూడో చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ ఓ మోస్తారు ఫలితాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ‘ఇడ్లి కడై’ (Idly Kadai) అనే సినిమా తీస్తున్నాడు ధనుష్. ఆ సినిమాలో తనే హీరో. ఈ సినిమా అయ్యాక అజిత్‌ని (Ajith Kumar)  డైరెక్ట్‌ చేస్తాడని కోడంబాక్కం వర్గాల టాక్‌.

వేసవిలో ‘ఇడ్లీ కడై’ సినిమా విడుదల కానుంది. ఆ సందర్భంలో అజిత్‌ సినిమా అనౌన్స్‌ చేస్తారు అని సమాచారం. ధనుష్ సినిమాల్లో ఎమోషన్లతో పాటు ఎలివేషన్లు కూడా భారీగానే ఉంటాయి. ఆ విషయం ‘రాయన్‌’ సినిమా చూసినవాళ్లు చెప్పేస్తారు. ఇప్పుడు ఆయన అజిత్‌ కోసం అలాంటి ఓ మాస్‌ కథ రాసుకున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు కూడా జరిగాయట. త్వరలోనే అధికారికంగా సినిమా అనౌన్స్‌ చేస్తారని సమాచారం.

ఇక అజిత్‌ ఇటీవల ‘విడా మయూర్చి’ ‘(Pattudala) అనే సినిమాతో వచ్చి ఇబ్బందికర ఫలితం అందుకున్నారు. త్వరలో ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly) అంటూ రాబోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. సినిమాలు ఇలా ఉంటే ఆయన తనకు ఇష్టమైన మోటో రేసింగ్‌ పాల్గొంటూ కప్‌లు గెలుస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus