శంకర్ సినిమా అంటే షెడ్యూల్స్, బడ్జెట్, షూటింగ్ డేస్.. ఇలాంటి వాటి గురించి మరచిపోవాలి అంటుంటారు ట్రేడ్ నిపుణులు. చిన్న సినిమాల్ని పక్కన పెట్టేస్తే భారీ సినిమా అనేసరికి శంకర్.. చాలా టైమ్ తీసుకుంటారని, బడ్జెట్ లెక్కలు అస్సలు పట్టించుకోడని చెబుతుంటారు. తాజాగా రామ్‌చరణ్ విషయంలో ఈ మాట మరోసారి నిజమైంది అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ సినిమా ప్రారంభానికి ముందు నిర్మాత దిల్ రాజు పెట్టిన కండిషన్లు పక్కన పెట్టేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.
గతంలో వచ్చిన పుకార్ల ప్రకారం చూస్తే చరణ్ సినిమాను శంకర్ సంక్రాంతికి కల్లా రిలీజ్ చేయాలని, బడ్జెట్ రూ. 200 కోట్లు దాటకూడదు అని అనుకున్నారట. అందుకు తగ్గట్టే షెడ్యూల్స్ ప్లాన్స్ చేశారని కూడా వార్తలొచ్చాయి. సినిమా షూటింగ్ కూడా అలానే స్పీడ్ స్పీడ్‌గా సాగిపోయింది. దీంతో ఏంటీ, శంకర్ మారిపోయారా ఇంత వేగంగా పూర్తి చేసేస్తున్నారా అని అనుకున్నారంతా. కానీ రెండు షెడ్యూల్స్ తర్వాత మొత్తం మారిపోయింది. ఖర్చు పెరుగుతోంది, రోజులు పెరుగుతున్నాయట.
దీంతో దిల్ రాజు ఈ సినిమాను సంక్రాంతి రేసు నుండి తప్పించి విజయ్ – వంశీ పైడిపల్లి ‘వారసుడు’ని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు శంకర్ సినిమా బడ్జెట్ రూ. 250 కోట్లు దాటిపోయింది అని చెబుతున్నారు. సినిమాకు సంబంధించి అంతా అవుట్ డోర్‌లోనే షూట్ చేస్తున్నారు. దీంతో అనుకున్న బడ్జెట్ మించి ఖర్చవుతుందని అంటున్నారు. ఆ మధ్య రాజమహేంద్రావరం షెడ్యుల్‌లోనే రూ.25 కోట్ల నుండి రూ. 30 కోట్లు ఖర్చయిందని భోగట్టా.
మరోవైపు ఆర్ట్ డైరెక్టర్‌ని ఇటీవల మార్చేశారట. రామకృష్ణ, మౌనిక బదులు రవీందర్ రెడ్డిని తీసుకున్నారు. రామకృష్‌ణ – మౌనిక మ్యాగ్జిమమ్ వర్క్ ఫినిష్ చేశారు. మిగిలిన వర్క్ రవీందర్ చేస్తున్నారట. దీంతో మళ్లీ బడ్జెట్ మీద ప్రభావం పడింది అని చెబుతున్నారు. సినిమాకు సంబంధించి ఇంకా 30 శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. ఈ ఏడాది ఆఖరి కల్లా మొత్తం షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్‌కి వెళ్లాలని చూస్తున్నారట. అలా బడ్జెట్ తడిసిమోపెడు అవుతోంది అంటున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!