కాన్ఫిడెన్స్ & ఓవర్ కాన్ఫిడెన్స్ కి మధ్య తేడాను ఈమధ్యకాలంలో హరీష్ శంకర్ తీరు అందరికీ అర్థమయ్యేలా చేసింది. సినిమా రిలీజ్ కి ముందు హరీష్ మీడియా ముందు చేసిన వీరంగం, కొందరి మీద వేసిన సెటైర్లు, ఇక సినిమాలో డైరెక్ట్ గా వేసిన కౌంటర్లు చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగని సినిమా రిలీజ్ తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా హరీష్ (Harish Shankar) తన సోషల్ మీడియా వార్ ను కొనసాగించిన తీరు కొందర్ని ఆశ్చర్యపరిచింది కూడా.
అయితే.. అంతలా ఎగిసిన హరీష్ శంకర్ తదుపరి చిత్రం ప్రస్తుతం డౌటులో ఉందని తెలుస్తోంది. నిజానికి హరీష్ శంకర్ దర్శకత్వంలో మూడు సినిమాలు ఒకే అయ్యాయని “మిస్టర్ బచ్చన్” (Mr Bachchan) టైంలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే, అందులో మొదటిది రామ్ హీరోగా ఉంటుందని స్వయంగా హరీష్ శంకర్ కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడిందని తెలుస్తోంది.
హరీష్ శంకర్ & రామ్ పోతినేని (Ram) ఇద్దరూ ఆగస్ట్ 15న దారుణమైన రిజల్ట్ ను చవిచూశారు. అయితే.. “మిస్టర్ బచ్చన్”తో హరీష్ శంకర్ ఎక్కడలేని నెగిటివిటీని మూటగట్టుకుంటే, “డబుల్ ఇస్మార్ట్”తో (Double Ismart) మాత్రం రామ్ మరోసారి తన ఎనర్జీతో అందరినీ మెస్మరైజ్ చేశాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరు సినిమా వద్దనుకున్నారు అనేది క్లారిటీ లేదు కానీ.. ప్రస్తుతానికి మాత్రం రామ్ & హరీష్ కాంబో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదని మాత్రం తెలుస్తోంది.
ఇకపోతే.. నిన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ “మిస్టర్ బచ్చన్” రిజల్ట్ విషయమై చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడం, దానికి మళ్ళీ నిర్మాత అవి హరీష్ ను ఉద్దేశించి నేనేమీ తక్కువ చేసి మాట్లాడలేదని వివరణ ఇవ్వడం, దానికి హరీష్ శంకర్ “త్వరలోనే ఇంకాస్త మంచి హిట్ సినిమా ఇస్తానని” ట్వీట్ చేయడం గట్రాలు ప్రస్తుతం హాట్ టాపిక్స్ గా మారాయి.