Trivikram: త్రివిక్రమ్ – బన్నీ.. ఓ టార్గెట్ సెట్టయ్యింది..!

టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram)  కాంబినేషన్ ప్రతీసారి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు ‘జులాయి (Julayi),’ ‘సన్నాఫ్ సత్యమూర్తి,’ (S/O Satyamurthy) ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo)  సూపర్ హిట్‌లుగా నిలిచాయి. మూడు సినిమాలతో కమర్షియల్‌గా బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకోవడం వల్ల వీరి కాంబినేషన్‌పై అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’  (Pushpa 2)  సినిమాతో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత హైప్ ఉన్న చిత్రంగా ‘పుష్ప 2’ విడుదలకు సిద్ధమవుతోంది.

Trivikram

ఈ చిత్రంతో ఐకాన్ స్టార్ 1000 కోట్ల క్లబ్‌లోకి చేరాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మేకర్స్ కూడా భారీ స్థాయిలో బిజినెస్‌కి సిద్ధమవుతున్నారు. ‘పుష్ప’ సినిమా తర్వాత బన్నీ తన కెరీర్‌లో మరో స్థాయికి ఎదిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పని చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రకటించబడింది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో ఉన్నారని సమాచారం.

స్క్రిప్ట్‌తో పాటు ప్రీప్రొడక్షన్ పనులు కూడా పూర్తవుతున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమా పీరియాడిక్ జోనర్‌లో, ఒక మైథలాజికల్ కాన్సెప్ట్ ఆధారంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో ఫస్ట్ మైథలాజికల్ మూవీగా నిలిచే అవకాశం ఉంది.

ప్రస్తుతం క్యాస్టింగ్ ప్రక్రియను ఫైనల్ చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి అన్ని పనులు త్వరగా పూర్తి చేసి, 2025 జూన్ లేదా జులైలో షూటింగ్ ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ గతంలో ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా, అది ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు త్రివిక్రమ్, బన్నీ కాంబోలో వస్తోన్న ఈ కొత్త ప్రాజెక్ట్‌ మాత్రం ఊహించిన రేంజ్ లో ఉంటుందని సమాచారం.

ఆ పాట విషయంలో సుకుమార్ నిర్ణయం మారిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus