సినిమా పరిశ్రమ అంటే కేవలం అదృష్టం మాత్రమే కాదు… టైమింగ్ కూడా… అయితే ఫ్లాప్ అయిన సినిమాని సూపర్ హిట్ అంటూ ప్రమోట్ చేస్తూ బడా హీరోలని భుజాలపై మోస్తూ ఉంటారు కొందరు దర్శక నిర్మాతలు. అయితే ఆ కోవలో బడా నిర్మాతలు సైతం ఉండడం నిజంగా మనం సిగ్గు పడాల్సిన విషయం. అయితే గత సంవత్సరం రిలీజ్ అయిన అల్లు అర్జున్ “సరైనోడు” సినిమా భారీ హిట్ అయింది అంటూ, దాదాపుగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అంటూ అల్లు ఆరవింద్ అప్పట్లో స్వయంగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే అదే క్రమంలో ఆ సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ రావడం గమనార్హం.ఇక ఆ కథ అంతా పక్కన పెడితే… ఇప్పుడు బన్నీ తాజా సినిమా డీజె సైతం అదే పరిస్థితి. ఈ సినిమాకి కూడా మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన తరుణంలో 70 కోట్లు చేసాం ,100 కోట్లు కలెక్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు.
అయితే ఇప్పుడు ఆడుతున్నది అంతా మైండ్ గేమ్… సినిమా హిట్ అని చెప్పుకోవడం… వెంటనే ఈ హీరో డేట్స్ కొట్టేసి వేరే సినిమా చేసేయ్యాలి అన్న ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న తంతు ఇది. ఇప్పుడు ఈ ఫేక్ కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉన్నాయి అంటే… తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ దామోదర్ ప్రసాద్ సైతం, అసలు ఈ కలెక్షన్స్ ఎక్కడ దారి తప్పుతున్నాయో అర్ధం కావడంలేదు అంటున్నారు అంటే ఈ ఫేక్ కలెక్షన్స్ జాడ్యం ఎంతమేరకు చొచ్చుకుపోయిందో అర్ధం కావడంలేదు. అయితే ఇది కేవలం మన తెలుగు సినిమాలకే కాదు. తమిళ సినిమాల్లో కూడా కొందరు దర్శక నిర్మాతలు హీరోల డేట్స్ కోసం చేస్తున్న కుస్తీ పట్లు, అంతెందుకు తాజాగా సూర్య నటించిన సింగం3 సినిమా అనుకున్నంత హిట్ అవ్వనప్పటికీ ఆ సినిమా 100కోట్లు వసూళ్లు సాధించింది అంటూ డప్పులు కొట్టి మరీ ఆ సినిమా దర్శకుడు హరికి టోయోటా ఫోర్టునెర్ ను బహుమతిగా ప్రకటించారు సూర్య. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఒక బడా హీరో డేట్స్ కోసం, ఆ హీరోతో సినిమా చెయ్యడం కోసం డిజాష్టర్ గా మారిన సినిమాని సూపర్ హిట్ అంటూ డప్పులు కొడుతూ, ఫేక్ పబ్లిసిటీ ఇస్తూ పాపం సినిమా కొనుక్కున్న బయ్యర్స్ కి అన్యాయం చేస్తున్నారు..
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.