దిల్ రాజుకి హీరోలు దొరికేశారట.. పాత వీడియో వైరల్ !

మల్టీస్టారర్ సినిమాలకి కాలం చెల్లిపోయింది అనుకుంటున్న టైంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు  (Mahesh Babu) , విక్టరీ వెంకటేష్(Venkatesh) ..ల కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. ‘ఆర్.ఆర్.ఆర్’  (RRR) వంటి మల్టీస్టారర్ చేయాలనే ధైర్యం రాజమౌళికి (S. S. Rajamouli) రావడానికి కారణం.. ఈ సినిమానే అని చెప్పాలి. దీని తర్వాత మల్టీస్టారర్ల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. ఆడియన్స్ కొత్త చెంజోవర్ దొరికేలా చేసింది ఈ సినిమా. అయితే అప్పట్లో ఈ సినిమాకి దక్కాల్సిన అప్రిసియేషన్ రాలేదు అనేది కొందరి వాదన. కొంతవరకు అది నిజమే.

Seethamma Vakitlo Sirimalle Chettu

2013 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యింది. కానీ.. మహేష్, వెంకటేష్ అభిమానులను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచిన సినిమా కాదు. బయ్యర్స్ కి భారీ లాభాలు అయితే పంచలేదు.వాళ్ళు పెట్టిన దానికి ఒక పది పైసలు ఎక్కువ లాభం వచ్చింది అనుకోవాలి అంతే..! ఈ సినిమా భారీ లాభాలు తేకపోడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆ టైంకి ఈ జోనర్ అనేది ఆడియన్స్ కి కొత్త. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని థియేటర్ వచ్చారు.

మహేష్, వెంకటేష్ ..లకు ఎలివేషన్ సీన్స్, ఫైట్స్ ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ అలాంటివి లేవు సినిమాలో..! కానీ టీవీల్లో వచ్చాక చాలా మంది రిపీటెడ్ చూశారు. ఇప్పుడు రీ- రిలీజ్లో అయితే హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. విచిత్రం ఏంటంటే.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ- రిలీజ్ కి మాసివ్ రెస్పాన్స్ వస్తుంది. ఆడియన్స్ ఓ మాస్ సినిమాకి ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తున్నారు.

దీంతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకు సీక్వెల్ కూడా కావాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరోలుగా వెంకటేష్ కొడుకు అర్జున్, మహేష్ బాబు కొడుకు గౌతమ్..లు హీరోలుగా చేస్తే బాగుంటుంది అని కొంతమంది భావిస్తున్నారు. దిల్ రాజు (Dil Raju) , శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala)..లకు రిక్వెస్ట్..లు కూడా పెట్టుకుంటున్నారు. అలాగే ‘సీతమ్మ వాకిట్లో..’ ఆడియో వేడుకలో అర్జున్, గౌతమ్..లు కలిసి ఉన్న వీడియోను కూడా పోస్ట్ చేస్తున్నారు.

కిరణ్ అబ్బవరం పేరులో ఈ మార్పు.. క్లారిటీ ఇచ్చేశాడుగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus