తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చేస్తున్న అతని చివరి సినిమా ‘దళపతి 69′(వర్కింగ్ టైటిల్) పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకుడు. వాస్తవానికి ఇది బాలకృష్ణ- అనిల్ రావిపూడి..ల సూపర్ హిట్ సినిమా ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ అంటూ ప్రచారం జరిగింది. విజయ్ కి ఆ సినిమా నచ్చడంతో రీమేక్ రైట్స్ కొనిపించి.. చివరి సినిమాగా చేస్తున్నట్టు టాక్ నడిచింది.
అయితే తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అయితే.. ఇది ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ అనే థాట్ ఎవ్వరికీ రావడం లేదు. ‘జన నాయగన్’ అనే టైటిల్ తో ఈ సినిమా నుండి విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో విజయ్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో స్టైలిష్ గానే కనిపిస్తున్నాడు. హీరో జనాలతో సెల్ఫీ తీసుకుంటున్న విధానాన్ని చూస్తుంటే.. ఇది కచ్చితంగా పొలిటికల్ టచ్ ఉన్న సినిమా అని అంతా భావిస్తున్నారు. ‘జన నాయకుడు’ అంటే.. పీపుల్స్ లీడర్.. ప్రజా నాయకుడు అనే అర్ధమే వస్తుంది.
సో విజయ్ 69 … ‘భగవంత్ కేసరి’ రీమేక్ అంటూ వస్తున్న ప్రచారం అబద్ధమేనా? లేక ఆ సినిమా సోల్ ని తీసుకుని.. తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు దర్శకుడు హెచ్.వినోద్ మార్పులు చేసి తెరకెక్కిస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ‘జన నాయగన్’ నుండి విడుదలైన విజయ్ లుక్ పోస్టర్ అయితే అభిమానులని ఆకట్టుకుంటుంది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.