కోలీవుడ్‌లో కమర్షియల్ డైరక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుల్లో అట్లీ ఒకరు. విజయ్‌తో వరుస సినిమాలు చేసి, విజయాలు అందుకున్న అట్లీ.. ఇప్పుడు షారుఖ్ ఖాన్‌తో సినిమా చేసి బాలీవుడ్‌లోకి కూడా వెళ్లిపోయారు. అయితే అతని మీద ఉన్న పెద్ద అపవాదు.. పాత తమిళ సినిమాలు, సౌత్ సినిమాల నుండి స్ఫూర్తి పొందుతూ, కొన్ని సార్లు ఫ్రీమేక్ చేస్తుంటారు అని. ‘తెరి’ సినిమా నుండి ఈ అపవాదులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ‘జవాన్’ విషయంలోనూ అదే జరుగుతోంది.
‘జవాన్’ (Jawan) సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమా ఏ సినిమాకు ఫ్రీమేక్ అంటూ చిన్నగా సన్నాయి నొక్కులు నొక్కారు తమిళ తంబీలు. అయితే ఎంత స్ఫూర్తి పొందినా, ఫ్రీమేక్ చేసినా తనదైన శైలిలో ఆ సినిమాను తెరకెక్కిస్తుంటారు అని అట్లీకి పేరు. ఇప్పుడు ‘జవాన్’ సినిమాను కూడా అలానే చేసుంటారు అంటూ పాత కమల్ హాసన్ సినిమాను పేరు ట్రెండ్ చేస్తున్నారు. ఆ సినిమా మూల కథను తీసుకొని అట్లీ ‘జవాన్’ను సిద్ధం చేశారు అనేది వారి మాట.
కమల్ హాసన్ చాలా ఏళ్ల క్రితం ‘ఓరు ఖైతియిన్ డైరీ’ అనే సినిమా తమిళంలో చేశారు. ఆ సినిమాను తెలుగులో ‘ఖైదీ వేట’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా కథాంశాన్ని తీసుకొనే ఇప్పుడు ‘జవాన్’ తెరకెక్కించారు అనేది మాట. ‘జవాన్’ ట్రైలర్‌లో చూపించిన ప్రకారం ఈ సినిమా తండ్రి కొడుకుల కథ. నాన్న గతంలో తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి రివెంజ్‌కు సిద్ధమైతే… కొడుకు ఖాకీ చొక్కా వేసుకుని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు.
కమల్ హాసన్ సినిమాలో తనకు అన్యాయం చేసిన వాళ్ల అంతం చూడానికి శ్రీదేవిని కిడ్నాప్ చేస్తాడు. ‘జవాన్’ సినిమాలో మెట్రో ట్రైన్‌ను హైజాక్ చేస్తాడు. ‘ఖైదీ వేట’ఓ తండ్రి ఓ మాములు వ్యక్తి. ఇక్కడ ఆర్మీలో పని చేసే టాప్ ఆఫీసర్. ఈ రెండు అంశాలే కాదు సినిమాలో ఇంకా చాలానే ఉన్నాయి అంటున్నారు. ఈ సంగతి ఈ నెలాఖరుకు తెలిసిపోతుంది. ‘తెరి’ సంగతి అన్నారు చెప్పలేదు అనుకుంటున్నారా? ఆ సినిమాకు విజయ్ కాంత్ ‘క్షత్రియుడు’ మూలం అని అంటారు.
మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!
సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!