Jr NTR: కొత్త సినిమా విషయంలో తారక్‌ అండ్‌ కో అలా ఆలోచిస్తున్నారా?

టాలీవుడ్‌లో కొంతమంది స్టార్‌ దర్శకులకు డెడ్‌లైన్‌ పెట్టకపోతే పని అవ్వదా? అలాగే కొన్ని విషయాల్లో పక్కాగా ఇలా జరగాల్సిందే అని చెప్పాల్సిందేనా? ఏమో.. ఆయా దర్శకుల గత సినిమాల ఫలితాలు, రాబోయే సినిమాల విషయంలో హీరో, నిర్మాతలు చేస్తున్న పనులు చూస్తుంటే అవును అనాలనే అనిపిస్తోంది. అలాంటి దర్శకుల జాబితాలో కొరటాల శివ కూడా ఉన్నారా? ఏమో ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి వస్తున్న పుకార్లు, వార్తలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత తారక్‌ ఇంతవరకు కొత్త సినిమా స్టార్ట్‌ చేయలేదు. అదిగో, ఇదిగో అంటూ వార్తలొస్తున్నా.. ఇంకా సినిమా షురూ కాలేదు. ఎప్పుడో గతేడాది జనవరిలో అన్నారు… ఇంకా మొదలుకాలేదు. ఇప్పుడేమో త్వరలో అని అంటున్నారు. అయితే ఈ ఏడాది ప్రయాణంలో సినిమాలోను, కథలోను, దర్శకుడి ఆలోచనల్లోనూ, హీరో – నిర్మాతల ప్లానింగ్‌లోనూ చాలా మార్పులు జరిగాయి అంటున్నారు. కథ నుండి మేకింగ్‌ వరకు చాలా మార్పులు చేశారు అని చెబుతున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలు, సినిమా టీమ్‌ నుండి వినిపిస్తున్న మాటల ప్రకారం అయితే.. మార్చి 20 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ఉండొచ్చు అని తాజా సమాచారం. ఆ రోజు నుండి ఏకధాటిగా ఆరు నెలల పాటు షెడ్యూల్స్‌ ప్లాన్స్‌ వేశారట. దీనికి తగ్గట్టు పూర్తి ప్లానింగ్ సిద్ధమయ్యాకే సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది అంటున్నారు. కొరటాల గత సినిమా ‘ఆచార్య’ దారుణంగా బెడిసికొట్టడం.. దాని వెనుక కొరటాల ప్లానింగ్‌ వైఫల్యం ఉందని పుకార్లు రావడంతో ఇప్పుడు తారక్‌ టీమ్‌ పక్కాగా ఉందట.

అలాగే ‘ఆచార్య’ సినిమా అమ్మకం, పంపిణీ విషయంలో కొరటాల ప్రమేయం ఉండటం కూడా.. ఇప్పుడు తారక్‌ టీమ్‌ ఆలోచనలు మారడానికి కారణం అంట. మంచి కథ సిద్ధం చేసుకుని, సినిమా చేయాలని.. మిగిలిన వాళ్ల ఆయా టీమ్స్‌ చూసుకుంటాయి అని కొరటాలకు క్లారిటీ ఇచ్చేశారట. అయితే మరి అనుకున్న సమయానికి కొరటాల శివ పూర్తి చేస్తారా అనేదే ఇక్కడ ప్రశ్న. ఆయన గత సినిమాల అనుభవంతోనే ఈ ప్రశ్న వినిపిస్తోంది. అయితే ఎలా చేసినా సినిమా వచ్చే సంక్రాంతికే అని మాత్రం చెబుతున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus