Kannappa: మంచు వారి ‘కన్నప్ప’.. డివోషనల్‌ రిలీజ్‌ డేట్‌ మీదే గురి?

మంచు వారి కుటుంబం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa)  . సింగిల్‌ షెడ్యూల్‌లో న్యూజిలాండ్‌లో షూటింగ్‌ పూర్తి చేసి.. రిలీజ్‌ చేసేస్తాం అని టీమ్‌ చెప్పింది. అయితే ఆ తర్వాత ప్లాన్స్‌ మారాయి. ఇక్కడ కూడా సెట్స్‌ వేసి కొన్ని సీన్స్‌ తీశారు. ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది అని చెబుతున్నారు. అయితే మరోవైపు ప్రచారం కూడా స్టార్ట్‌ చేశారు. తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ గురించి చర్చ జరుగుతోంది.

Kannappa

‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా సంక్రాంతికి వెళ్లిపోవడంతో డిసెంబరు ఆఖరి రెండు వారాల్లో పెద్ద సినిమాలు లేవు అనే చర్చ మొదలైనప్పుడు ‘కన్నప్ప’ ఎందుకు రాకూడదు, మంచి టైమ్‌ కదా అని ఓ చర్చ మొదలైంది. సినిమా టీమ్‌ కూడా గత కొన్ని రోజులుగా వీడియోలు, క్యారెక్టర్‌ పోస్టర్లతో ప్రచారం ముమ్మరం చేసింది. సినిమాలోని కీలక నటుల పాత్రలను పరిచయం చేస్తున్నారు. కాబట్టి టీమ్‌ రెడీగా ఉందా అనే చర్చ మొదలైంది.

కానీ, సినిమా టీమ్‌ ఆలోచనలు చూస్తుంటే దసరాకు కానీ, బిజీ సంక్రాంతికి కానీ వచ్చే ఆలోచనలో లేరు అనిపిస్తోంది. సినిమా బిజినెస్‌ పనులు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదని, ఒకవేళ స్టార్ట్ చేసినా అల్లాటప్పాగా అమ్మేసే ఆలోచనలో లేరు అని తెలుస్తోంది. టీజర్, పోస్టర్లకు వచ్చిన స్పందనను చూసి.. పర్‌ఫెక్ట్ ట్రైలర్‌ను కట్‌ చేసే పనిలో ఉన్నారట. ట్రైలర్‌ వచ్చాక కచ్చితంగా సినిమాకు అవసరమైన హైప్‌ వస్తుందని నమ్ముతున్నారు.

సంక్రాంతి సినిమాల హంగామా అయిపోయాక తమ సినిమాకు సంబంధించి పూర్తి స్థాయి ప్రచారం కోసం రంగంలోకి దిగుతారట. అలాగే సినిమా మార్కెటింగ్‌ పనులు కూడా చూస్తారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది శివరాత్రిని సినిమా టీమ్‌ టార్గెట్‌ చేసుకుందట. సినిమా నేపథ్యానికి శివరాత్రి అయితే కరెక్ట్‌ అని అంటున్నారు. అదే జరిగితే ఫిబ్రవరి ఆఖరి వారంలో సినిమాను రిలీజ్‌ చేసే ఛాన్స్‌ ఉంది. ఎందుకంటే 26న మహా శివరాత్రి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus