ఆ బాలీవుడ్ హీరోయిన్ పెద్ద రిస్క్ చేస్తుందా?

సాధారణంగా హీరోయిన్లు బరువు పెరిగే పాత్రలు చేస్తే.. వారు పెద్ద రిస్క్ చేస్తున్నట్టే అని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎంత కంట్రోల్ చెయ్యాలని వారు ట్రై చేసినా అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ లు చాలా తక్కువ. ఈ విషయంలో మన అనుష్క ను బెస్ట్ ఎగ్జామ్పుల్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే తప్పు మహేష్ హీరోయిన్ చేస్తుందా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మహేష్ -సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కృతీ సనన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత ఈమె నాగ చైతన్య తో ‘దోచేయ్’ చిత్రంలో కూడా నటించింది. ఆ సమయంలో ఈమెకు తెలుగులో మరిన్ని చిత్రాలు చేసే అవకాశాలు వచ్చినా వాటిని రిజెక్ట్ చేసి బాలీవుడ్ కు చెక్కేసింది.

ఇప్పుడు అక్కడ ఆమె చాలా బిజీ హీరోయిన్. ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ లో ఈమె నటించింది. ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ రిజెక్ట్ చేసి.. ‘మిమి’ అనే చిత్రం చేస్తుందట. ఈ చిత్రంలో ఈమె సిరోగసి మదర్ పాత్రలో కనిపించబోతుందట. అంటే ‘9 నెలలు’ సినిమాలో సౌందర్య అలగే ‘వెల్కమ్ ఒబామా’ సినిమాలో ఊర్మిళా కనిత్కర్.. టైపు పాత్ర అన్న మాట. అయితే ఈ పాత్రకోసం కృతీ ఏకంగా 15 కేజీలు బరువు పెరిగిందట. సినిమా షూట్ అయ్యాక మళ్ళీ బరువు తగ్గే ప్రయత్నాలు మొదలుపెడతాను అని దర్శకనిర్మాతలతో చెబుతుందట. అయితే అలా తగ్గడం చాలా కష్టమే. కనీసం 6 నెలల టైం అయినా పడుతుంది. అప్పటివరకూ ఈమె మరో ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పలేము. చెప్పాలంటే.. ఈమె నిజంగా రిస్క్ చేస్తున్నట్టే..!

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus