సినిమా హీరోలు వాళ్ళ సినిమాలు సక్సెస్ సాధించినప్పుడు సంతోషపడడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. “బ్రహ్మోత్సవం, స్పైడర్” లాంటి డిజాస్టర్ల తర్వాత “భరత్ అనే నేను”తో మహేష్ బాబు సూపర్ హిట్ అందుకున్నప్పుడు మహేష్ ఆనందాన్ని ఆయన అభిమానులు మాత్రమే కాదు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా పంచుకొన్నారు. ఎందుకంటే.. “భరత్ అనే నేను” విజయంలో ఒక నిజాయితీ, తపన కనిపించాయి. కానీ.. “మహర్షి” విజయంలో ఆ రెండు లోపించాయి. ఈ విషయం మహేష్ అభిమానులకు కూడా తెలుసు.
కానీ.. నిన్న జరిగిన “మహర్షి” సక్సెస్ మీట్ లో మహేష్ బాబు కాలర్ ఎగరేయడం, అనంతరం దర్శకుడు వంశీ పైడిపల్లికి ముద్దు పెట్టడం లాంటివి చూస్తుంటే.. మహేష్ మరీ ఎక్కువగా ఎగ్జైట్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. కెరీర్ కి చాలా అవసరమైన టైమ్ లో వచ్చిన “శ్రీమంతుడు, భరత్ అనే నేను” విజయాల టైమ్ లో కూడా మహేష్ చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేశాడు. కానీ.. క్రిటిక్స్ మరియు చాలా మంది ఆడియన్స్ కూడా “శ్రీమంతుడు 2″లా ఉందని భావించిన “మహర్షి” సినిమా సాధించిన సాధారణ విజయానికి మాత్రం మహేష్ మరీ ఎక్కువగా పొంగిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఇంకా సేఫ్ జోన్ లోకి రాలేదు.
నాన్ బాహుబలి రికార్డ్స్ కూడా క్రియేట్ చేయలేదు, ఓవర్సీస్ లో కూడా ఇంకా కేవలం 1 మిలియన్ మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి. ఎగ్జిబిటర్స్ కి లాభాలు వచ్చిన తర్వాత ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగి ఉంటే బాగుండేదని ఇండస్ట్రీ వర్గాల ఆలోచన. చూద్దాం మరి ప్రస్తుతానికి కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి. కాకపోతే. ఈ కలెక్షన్స్ వీక్ డేస్ లో ఎలా ఉంటాయి అనేదాన్నిబట్టి అందరికీ లాభాలు వస్తాయా లేదా అనేది తెలిసిపోతుంది.