ఓ యాడ్ కోసం ఫ్యామిలీ మొత్తాన్ని దించేసిన మహేష్..!

ప్రిన్స్ నుండీ సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. 100 కోట్ల మార్కెట్ ను కరెక్ట్ గా ‘స్టాండర్డ్ గా’ మైంటైన్ చేస్తుంది మహేష్ ఒక్కడే. సినిమానే తన ప్రపంచం. సినిమా కోసం ఎంత కష్టపడాలో.. కష్టపడుతుంటాడు..! ఎటువంటి కాంట్రవర్సీల జోలికి పోడు. అయితే ఇప్పుడు ‘మహేష్ ఇంత దిగజారిపోయాడు ఏంటి?’ అంటూ ఆయన పై కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకూ కార్పొరేట్ ప్రోడక్టులకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఓ యాడ్ కోసం తన భార్య నమ్రత తో పాటు కొడుకు గౌతమ్, కూతురు సితార లను కూడా దించేసాడు. సరిగ్గా ఈ విషయం పైనే మహేష్ పై సెటైర్లు పడుతున్నాయి. ఆయన ఫ్యాన్స్ వరకూ ఆనందపడుతున్నప్పటికీ… మిగిలిన వారు మాత్రం ‘మహేష్ బాగా డబ్బు మనిషి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే యాడ్స్ చేయడంలో తప్పే లేదు. చాలా మంది హీరోయిన్లు, హీరోలు కుటుంబం తో సహా యాడ్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. పైగా మహేష్ సంపాదించిన డబ్బుతో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. మిగిలిన వారు ఎవ్వరూ చేయని మంచి పనులు కూడా మహేష్ చేస్తున్నాడు కాబట్టి.. అలాంటి కామెంట్లు చేసే వాళ్ళు కాస్త ఇవి కూడా గుర్తు చేసుకుంటే బెటర్..!

బర్త్ డే స్పెషల్ : ప్రభాస్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus