Meghana Raj: మేఘనా రాజ్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారా?

కన్నడ, మలయాళ, తమిళ సినిమాలలో నటించి మేఘనా రాజ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. చిరంజీవి సర్జా భార్యగా ప్రేక్షకులకు మేఘనా రాజ్ సుపరిచితం. గతేడాది చిరంజీవి సర్జా గుండె పోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. చిరంజీవి సర్జా మృతి తర్వాత మేఘనా రాజ్ పెళ్లికి సంబంధించి అనేక వార్తలు ప్రచారంలో వచ్చాయి. చిరంజీవి సర్జా మృతి సమయంలో మేఘనారాజ్ నాలుగు నెలల గర్భవతి కాగా కొన్ని నెలల క్రితం మేఘనా రాజ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

అయితే మేఘనా రాజ్ కన్నడ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచిన ప్రథమ్ ను వివాహం చేసుకోబోతున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మేఘనా రాజ్ రెండో పెళ్లి వార్తల గురించి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. మేఘనా రాజ్ ఈ వార్తల గురించి స్పందించకపోవడంతో చాలామంది ఈ వార్తలు నిజమేనని నమ్మారు. అయితే బిగ్ బాస్ విన్నర్ ప్రథమ్ మాత్రం జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు.

యూట్యూబ్ లో వైరల్ అయిన వీడియోను షేర్ చేస్తూ కొంతమంది డబ్బులు, వ్యూస్ కొరకు రూమర్స్ ను ప్రచారం చేస్తున్నారని ప్రథమ్ కామెంట్లు చేశారు. ఇలాంటి వీడియోలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటే మాత్రమే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ప్రథమ్ చెప్పుకొచ్చారు. మేఘనారాజ్, చిరంజీవి సర్జా దాదాపు పది సంవత్సరాలు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. భర్త మృతి తర్వాత భర్తకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేఘనారాజ్ భర్తపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తున్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus