నరేశ్‌ కొడుకు ఫొటోలు వైరల్‌.. చూశారా!

నవీన్‌ అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ… నవీన్‌ విజయ్‌కృష్ణ అంటే అందరికీ తెలిసే అవకాశం ఉంది. ఆ.. అతనే నటుడు నరేశ్‌ తనయుడు. అప్పుడెప్పుడో ఐదేళ్ల క్రితం ‘నందిని నర్సింగ్‌ హోం’తో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంటర్‌ అయ్యాడు. ఆ సినిమా ఫర్వాలేదనిపించింది. అయితే ఆ తర్వాత సినిమాలు పెద్దగా చేసింది లేదు. ‘ఊరంతా అనుకుంటున్నారు’ అంటూ ఓ సినిమా చేశాడు. అది కూడా బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. ఈ ఫలితాల కారణమో, ఇంకేమో కానీ… నవీన్‌ మళ్లీ ముఖానికి రంగేసుకోలేదు. తొలి సినిమాగా ప్రారంభమైన ‘రెండు జళ్ల సీత’కు సంబంధించిన ప్రమోషన్స్‌ ఇటీవల కొన్ని కనిపించాయి. దీంతో మళ్లీ నవీన్‌ సినిమాలు చేస్తాడేమో అని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా నవీన్‌ లుక్‌ను చూస్తుంటే.. మళ్లీ సినిమాలు చేసే అవకాశం లేనట్లు అనిపిస్తోంది. అవును.. కావాలంటే పై ఫొటోలో చూడండి.. మీకే అర్థమవుతుంది.

పద్మాలయ స్టూడియోస్‌ పెట్టి 52 ఏళ్లు పూర్తయిన సందర్భంగా… దానికి విజయలక్ష్మి గ్రీన్‌ స్టూడియోస్‌గా మారుస్తున్నట్లు టీమ్‌ ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ కార్యక్రమం కూడా నిర్వహించింది. దానికి నవీన్‌ విజయ్‌కృష్ణ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అందులో నవీన్‌ చాలా లావుగా కనిపిస్తున్నాడు. హీరోల ఫిజిక్‌ లా అస్సలు కనిపించడం లేదు. దీంతో ఇక హీరో పాత్రలకు నవీన్‌ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.

నిజానికి నవీన్‌ గతంలో చాలా లావుగా ఉండేవాడు. హీరో అవకాశాల కోసం బాగా తగ్గాడని కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. హీరో కాకముందు నవీన్‌ ఎడిటింగ్‌ వర్క్‌ చేసేవాడు. రామానాయుడు స్టూడియోస్‌లోనే ఎక్కువగా ఈ పని చేసేవాడు. దీంతో మళ్లీ ఆ వర్క్‌లోకే వచ్చేస్తాడని కొందరు అంటున్నారు. ఇప్పుడు పెట్టిన విజయలక్ష్మి గ్రీన్‌ స్టూడియోస్‌ కూడా అదే బేస్‌లో పని చేయబోతున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus