Veerappan: నాలుగు భాషల్లో రాబోతున్న ‘వీరప్పన్‌’… కొత్త ఏం చెబుతారో మరి!

వీరప్పన్‌ గురించి ఇప్పటి తరం జనాలక పెద్దగా తెలియదు కానీ… నిన్నటి తరం వాళ్లకు బాగా తెలుసు. అంతకుముందు తరం వాళ్లకు అయితే ఆయన చేసిన నేరాలు కూడా బాగా తెలుసు. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వీర్పన్‌ గురించి అందుకేనేమో మన సినిమా మేకర్స్‌ ఏదో విధంగా చెబుతూనే ఉన్నారు. ఇప్పటికే వీరప్పన్‌ గురించి చాలా సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంటరీలు రాగా… ఇది కొత్తది.

గంధపు చెక్కల స్మగ్లర్‌ గజదొంగ వీరప్పన్‌ గురించి కథలు కథలు చెప్పుకుంటూ ఉంటారు. కన్నడ సూపర్ స్టార్ దివంగత రాజ్ కుమార్‌ని కిడ్నాప్ చేసి మరీ గవర్నమెంట్ ముందు డిమాండ్లు పెట్టినోడు వీరప్పన్‌. వేలాది ఏనుగులను దంతాల కోసమే హతమార్చడం, పోలీసులను కిరాతకంగా చంపడం లాంటి ఎన్నో దుర్మార్గాలు వీరప్పన్‌ చరిత్రలో ఉన్నాయి. అయితే ఇన్ని తప్పులు చేసినా, హత్యలు చేసినా అతనని మంచివాడిగా కొలిచే వారూ ఉన్నారు. అడవికి దగ్గరి గ్రామాల ప్రజలను బాగా చూసుకోవడమే దానికి కారణం.

ఆ విషయాన్ని ఇప్పటి జనాలు మెల్లమెల్లగా మరచిపోతున్నారు. అయితే మన సినిమా జనాలు మాత్రం ఇంకా ఏదో రూపంలో చెబుతూనే ఉన్నారు. తాజాగా త్వరలో జీ5లో ‘కూసే మునిస్వామి వీరప్పన్’ పేరుతో డాక్యుమెంటరీ సిరీస్ రాబోతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ బయటకు వచ్చింది. దానిని హీరో సూర్య షేర్ చేశాడు. దీంతో ఈ డాక్యు సిరీస్‌ మీద జనాల్లో ఆసక్తి పెరిగింది. అయితే కొన్నివారాల క్రితమే నెట్ ఫ్లిక్స్‌లో ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ పేరుతో ఒక సిరీస్ స్ట్రీమ్‌ అయ్యింది.

గతంలో శివరాజ్ కుమార్‌తో రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ అనే పేరుతో ఓ సినిమా చేసి హిట్‌ కొట్టారు. ఇక కిషోర్ – అర్జున్ ప్రధాన పాత్రల్లో ‘అట్టహాస’ పేరుతో వీరప్పన్ మీదే ఓ సినిమా వచ్చింది. అంతేకాదు గతంలో నాజర్, దేవరాజ్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు (Veerappan) వీరప్పన్‌లా కొన్ని సినిమాల్లో నటించారు కూడా.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus