Prabhas, Kriti Sanon: ఆ హీరోయిన్ ప్రభాస్ ప్రేమ.. నిజమేనా..?

పెదనాన్న కృష్ణంరాజు మరణించడంతో ప్రభాస్ చాలా బాధలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో బాలీవుడ్ మీడియా అతడి లవ్ లైఫ్ పై రూమర్స్ క్రియేట్ చేయడం అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని.. ఒకరిపై మరొకరికి స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయని కథనాలు రాస్తున్నారు.

నిజానికి బాలీవుడ్ సినిమా రిలీజ్ కి ముందు హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్ ఉందని వార్తలు రాస్తుంటారు. ఆ వార్తలు సినిమాకి మరింత బజ్ ను తీసుకొస్తుండడంతో తారలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ప్రస్తుతం ప్రభాస్ ఉన్న పరిస్థితుల్లో అతడిపై కావాలని ఇలాంటి రూమర్స్ సృష్టించడం కరెక్ట్ కాదు. కరణ్ జోహార్ హోస్ట్ చేస్తోన్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొంది కృతిసనన్. ఈ షోలో భాగంగా కృతి.. ప్రభాస్ కి ఫోన్ చేసింది.

అప్పటినుంచి ఈ రూమర్లు మరింత ఎక్కువయ్యాయి. ఇదివరకు ప్రభాస్.. అనుష్కతో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఈ ఇద్దరూ పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇప్పుడు కృతసనన్ తో లింక్ చేస్తూ వార్తలు రాస్తున్నారు. ఇందులో నిజం లేదని ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు.

ప్రభాస్ ఇలాంటి రూమర్స్ ని పట్టించుకోరని.. కానీ ఇప్పుడు ఆయన ఉన్నా పరిస్థితుల్లో ఇలాంటి వార్తలు వైరల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. బహుశా ఈ వార్తలపై ప్రభాస్ స్పందించకపోవచ్చు. కృతిసనన్ ఏమైనా మాట్లాడుతుందేమో చూడాలి!

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus