Pushpa 2: ఇంకా 80 శాతం కంప్లీట్ అవ్వకుండానే అంత ఫుటేజ్ వచ్చిందా?

అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్ (Sukumar)  కాంబినేషన్లో ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  రూపొందుతుంది. ‘పుష్ప’ సినిమా ఇండియా వైడ్ సక్సెస్ అందుకోవడంతో ‘పుష్ప 2’ పై అంచనాలు ఏర్పడ్డాయి. నిజానికి ‘పుష్ప’ భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అయితే కాదు. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. ఆంధ్రాలో నష్టాలు వచ్చాయి. నైజాంలో పెట్టింది వచ్చింది అంతే.! మిగతా భాషల్లో కూడా దగ్గరగా కలెక్ట్ చేసింది. కానీ నార్త్ ఆడియన్స్ ఆ సినిమాని ఎక్కడో కూర్చోబెట్టారు.అక్కడి బయ్యర్స్ కి 10 రెట్లు లాభాలు వచ్చాయి.

ఏదేమైనా రూ.350 కోట్ల వరకు కలెక్ట్ చేసిన సినిమా కాబట్టి..’పుష్ప’ లో ఉన్న లోపాలు ‘పుష్ప 2’ లో రిపీట్ కాకూడదని భావించి.. అందరూ మెచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలని దర్శకుడు సుకుమార్ భావించాడు. అందుకే మొదటి నుండి ‘పుష్ప 2’ ని తెగ చెక్కడం స్టార్ట్ చేశాడు. సాధారణంగానే సుకుమార్ ..ఒక్కో సీన్ కి 4,5 రోజులు తీసుకునే రకం. రిలీజ్ ఇంకో 2 రోజుల్లో ఉందని తెలిసినా.. షూటింగ్ చేస్తూనే ఉంటాడు.

అలాంటిది ‘పుష్ప 2’ ని అతను అంత ఈజీగా తీసుకోడు కదా.! కాబట్టి.. ‘పుష్ప 2’ కి అదే పెద్ద సమస్యగా మారింది. ఇప్పటివరకు ‘పుష్ప 2’ ఫుటేజీ మూడున్నర గంటలు దాటేసిందని ఇన్సైడ్ టాక్. అయినప్పటికీ షూటింగ్ ఇంకా 80 శాతం కూడా కంప్లీట్ అవ్వలేదట. ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) పార్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు. అది సినిమాలో చాలా కీలకం.

దీంతో ‘దానికెంత టైం తీసుకుంటాడో సుకుమార్’ అని నిర్మాతలు కూడా కంగారు పడుతున్నట్టు వినికిడి. ఈ దశలో డిసెంబర్ నాటికి కూడా షూటింగ్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. మళ్ళీ ఎడిటింగ్ రూంలో కూర్చొని చాలా ఫుటేజీ ట్రిమ్ చేయాలి. బడ్జెట్ కూడా ఎప్పుడో కంట్రోల్ తప్పిందని ఇన్సైడ్ టాక్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus