Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ కి ఇద్దరు ఎడిటర్లని మార్చింది అందుకేనా?

అల్లు అర్జున్  (Allu Arjun) లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) నిన్న రిలీజ్ అయ్యింది. సుకుమార్   (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను రాబట్టుకుంది. మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. హిందీలో కూడా రూ.65 కోట్లు నెట్ కలెక్షన్స్ ను రాబట్టి.. అక్కడ ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది. రెండో రోజు కూడా బుకింగ్స్ చాలా బాగున్నాయి. టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా జనాలు తగ్గడం లేదు.

Pushpa 2 The Rule

ముఖ్యంగా హిందీలో రెండో రోజు కూడా రూ.50 కోట్లు నెట్ కలెక్షన్స్ సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘పుష్ప 2’ రన్ టైం విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ విషయంలో సుకుమార్ పై నిర్మాతలు మొదట ఒత్తిడి తెచ్చారట. కానీ సుకుమార్ అందుకు ఒప్పుకోలేదట. వాస్తవానికి ముందుగా ఈ సినిమా రన్ టైం 4 గంటలు వచ్చిందట.

అయితే అంత రన్ టైంతో థియేటర్లలో విడుదల చేయడం అసాధ్యం. మొదట ఈ సినిమాకి రూబెన్, కార్తీక్ శ్రీనివాస్ అనే ఇద్దరు ఎడిటర్లు పనిచేసారు. పార్ట్ 1 కి కూడా వాళ్ళే. ఆ ఇద్దరూ ట్రై చేసినా 20 నిమిషాలకి మించి ట్రిమ్ చేయలేకపోయారట. దీంతో నిర్మాతలు ఎంతో అనుభవం ఉన్న నవీన్ నూలిని రంగంలోకి దింపారు. ఆయన మళ్ళీ మొదటి నుండి 4 గంటల ఫుటేజీని చూసి..

సుకుమార్ ని ఇబ్బంది పెట్టకుండా 3 గంటల 20 నిమిషాలకి కుదించాడట. ‘యానిమల్’ (Animal) వంటి సినిమా కూడా అదే రన్ టైంతో రిలీజ్ అవ్వడం వల్ల.. నిర్మాతలైన ‘మైత్రి’ వాళ్ళు రాజీకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో కట్ చేసిన ఫుటేజీని మూడో భాగంలో చూసే అవకాశం ఉందట.

రేణుక కుటుంబానికి బన్నీ ఆర్థిక సహాయం!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus