Raghava Lawrence: ‘కిల్’ ఫ్యాన్స్ కి.. కొంత రిలీఫ్ ఇచ్చే న్యూస్.!

బాలీవుడ్లో లక్ష్య, రాఘవ్ జుయాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కిల్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి నార్త్.. ఆడియన్స్ కంటే కూడా సౌత్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎక్కువగా చూశారు అని చెప్పాలి. ఓటీటీలో కూడా ‘కిల్’ ని ఎగబడి చూశారు. సినిమాలో హైలెట్ గా కొన్ని యాక్షన్ బ్లాక్స్ ను.. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో షేర్ చేసి, వైరల్ చేశారు నెటిజన్లు. అంతేకాదు తెలుగులో ఈ సినిమాని రీమేక్ చేయాలని డిమాండ్ కూడా చేశారు.

Raghava Lawrence

ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే ‘కిల్’ రీమేక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బాగా షికారు చేసింది. లారెన్స్ (Raghava Lawrence)  హీరోగా ఈ చిత్రం తెలుగు-తమిళ భాషల్లో రీమేక్ అవుతుందని, టాలీవుడ్ దర్శకుడు రమేష్ వర్మ (Ramesh Varma) .. ఈ రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. వాస్తవానికి ‘కిల్’ ని రీమేక్ చేయాలంటే చాలా మార్పులు చేయాలి. అందులో మితిమీరిన వయొలెన్స్ ఉంటుంది. నేటివిటీ కూడా కొంత మిస్ అవుతుంది.

ఓటీటీకి అయితే పర్వాలేదు కానీ థియేటర్ల కోసం తీస్తున్నట్టు సోల్ ను మిస్ చేయకుండా మార్పులు చేయాలి. పెర్ఫార్మన్స్..లు కూడా హానెస్ట్ గా ఉండాలి. కానీ లారెన్స్ హీరో, రమేష్ వర్మ డైరెక్షన్ అంటే అది పూర్తిగా వర్కౌట్ అయ్యే పని కాదు. అందుకే ‘కిల్’ రీమేక్ అప్డేట్ పై నెటిజన్లు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే ‘కిల్’ రీమేక్..లో లారెన్స్ హీరోగా నటించడం లేదట. కానీ రమేష్ వర్మనే డైరెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కిల్ రీమేక్ తో పాటు దర్శకుడు రమేష్ వర్మ… లారెన్స్ 25 మూవీని కూడా డైరెక్ట్ చేస్తున్నాడట. రెండు ప్రాజెక్టుల షూటింగ్ ఏకకాలంలో జరుగుతుందని సమాచారం. సో నెటిజన్లకు కొంత రిలీఫ్ ఇచ్చే న్యూస్ ఏంటంటే.. లారెన్స్ ఈ రీమేక్లో నటించడం లేదు. ఓ మిడ్ రేంజ్ హీరోతో ‘కిల్’ రీమేక్ ఉంటుందని తెలుస్తుంది.

ఆ కొరియోగ్రాఫర్లకు జానీ మాస్టర్ సభ్యత్వాలు ఇవ్వలేదా.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus