Rajamouli: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోల పరిస్థితి ఏంటి? ఏమవుతుంది?

సెంటిమెంట్లు లేని మనిషి ఉండరు అంటుంటారు. అదే సినిమా వాళ్లయితే ఇంకొంచెం ఎక్కువే అని చెప్పొచ్చు. కథ వినడం దగ్గర నుండి, రిలీజ్‌ అయ్యాక తొలి షో చూడటం వరకు అన్ని విషయాల్లో సెంటిమెంట్లు పక్కాగా పాటిస్తారు. అలాగే సినిమాకు సెలక్ట్‌ చేసిన నటీనటుల విషయంలోనూ సెంటిమెంట్లు ఉంటాయి అని చెబుతుంటారు. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ ‘ఆర్ఆర్‌ఆర్‌’ హీరోలను ఇబ్బంది పెడుతుందా? ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది.

Click Here To Watch NOW

రాజమౌళితో సినిమా చేసిన తర్వాత మళ్లీ విజయం అందుకోవాలంటే చాలా కష్టపడాలి, అంత చేసినా ఎన్నో ఏళ్ల పట్టేస్తుంది అంటుంటారు. అలా ప్రజెంట్‌ హీరోలు రామ్‌చరణ్‌, తారక్‌ కూడా ఇబ్బంది పడతారా. ఒకవేళ ‘రాజమౌళి హీరోలు – విజయాలు’ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయితే మాత్రం వరుస పరాజయాలు ఎదుర్కోక తప్పదు. రాజమౌళి సినిమాలు చూస్తే.. రీసెంట్‌ నుండి వెనక్కి వెళ్దాం. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ రెండు సినిమాలు చేశాడు.. ఏవీ వర్కవుట్‌ కాలేదు. ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’ ఇబ్బందిపెట్టాయి.

అంతెందుకు చిరంజీవికి ‘మగధీర’తో కెరీర్‌ బెస్ట్‌ ఇచ్చారు రాజమౌళి. ఆ తర్వాత చరణ్‌ చేసిన ‘ఆరెంజ్‌’ దారుణంగా దెబ్బకొట్టింది. ఇక ఎన్టీఆర్‌కి అయితే వరుస సినిమాలు ఇచ్చారు రాజమౌళి. అలాగే ఫ్లాప్‌లు వచ్చాయి కూడా. ‘స్టూడెంట్‌ నం.1’ తర్వాత ‘సుబ్బు’ దెబ్బేసింది. ఇక ‘సింహాద్రి’ తర్వాత ఎన్టీఆర్‌ పరిస్థితి అయితే దారుణం. వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ‘ఆంధ్రావాలా’, ‘సాంబ’, ‘నా అల్లుడు’, ‘నరసింహుడు’, ‘అశోక్‌’, ‘రాఖి’ దారుణ పరాజయం ఇచ్చాయి. మళ్లీ ‘యమదొంగ’తో రాజమౌళినే హిట్‌ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత సినిమా అయినా హిట్టా అంటే ‘కంత్రి’ కొట్టేసింది.

ఇదంతా చూస్తుంటే ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ పరిస్థితి ఏంటి అనేది ఆలోచన. అయతే అప్పట్లో ఈ హీరోల కథల ఎంపిక దారుణంగా ఉండేది. ఈ మాట మేం అనలేదు. రాజమౌళి ఇంకా ఆ హీరోలే అన్నారు. కానీ ఇప్పుడు చరణ్‌ నెక్స్ట్‌ సినిమాలు బలమైన కథలు, దర్శకుల చేతుల్లోనే ఉన్నాయి. కొరటాల శివ ‘ఆచార్య’, శంకర్‌ సినిమా భారీగానే ఉంటాయి, బలంగానే ఉంటాయి. ఇక తారక్‌ అయితే కొరటాల శివ సినిమా చేస్తాడు. ఆ తర్వాత బుచ్చిబాబు, అనిల్‌ రావిపూడి సినిమాలు ఉండొచ్చు. కాబట్టి అప్పటంత ఫ్లాప్‌లు రాకపోవచ్చు అంటున్నారు. అయినా ఆ సెంటిమెంట్‌ వర్కవుట్‌ కాకూడదు మనకు కావాల్సింది ఇదే.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus