రామానాయుడు స్టూడియోస్.. హైదరాబాద్‌లో ఈ పేరుతో రెండు ఉన్నాయి, విశాఖపట్నంలో ఒకటి ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌లో ఉన్న రెండింటిలో ఒకదాంట్లోనే సీరియస్‌గా సినిమా వర్క్లు జరుగుతున్నాయి అంటుంటారు. ఇక విశాఖపట్నంలో ఉన్న స్టూడియో గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ స్టూడియోను కొంతవరకు లేదా మొత్తంగా ప్రభుత్వం తీసుకుంటుందని చర్చ నడుస్తోంది. ఎందుకు, ఏమిటి, ఎలా అనే విషయమై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తోందని టాక్.
ప్రాథమికంగా చెప్పాలంటే రామానాయుడు స్టూడియోస్ విషయంలో ప్రభుత్వం నుంచి కానీ, సురేశ్‌బాబు నుండి కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ చర్చ అయితే జోరుగా నడుస్తోంది. రామానాయుడు ఎంతో ఇష్టపడి కట్టుకున్న స్టూడియోలు ఇవి. విశాఖపట్నంలోనూ షూటింగులు విరివిగా జరగాలని, చిత్రసీమ ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ ఎదగాలనే సంకల్పంతో అప్పటి ప్రభుత్వం రామానాయుడు స్టూడియో కోసం భారీగా భూములు కేటాయించింది. అయితే, ఆశించిన మేర అక్కడ షూటింగ్‌లు జరగడం లేదు అని టాక్. గత కొన్ని రోజులుగా అక్కడ సినిమా షూటింగ్‌లు జరిగిన దాఖలాలు లేవు.
దీంతో ఆ ప్రాంతం గురించి అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తీవ్రంగా ఆలోచిస్తున్నారని టాక్ నడుస్తోంది. రామానాయుడు స్టూడియోలో షూటింగులు సరిగా జరగడం లేదని చెబుతూ.. ఆ ప్రభుత్వ స్థలాన్ని స్టూడియో కోసం కేటాయించడంలో అర్థం లేదని ఏపీ మంత్రులు కొంతమంది సీఎం జగన్ ముందుకు తీసుకెళ్లారట. ఆ స్టూడియో విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియడం లేదు.
కొంతమంది అయితే ఆ స్టూడియో స్థలాన్ని వాడటం లేదు కాబట్టి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోంది అంటుంటే.. మొన్నీమధ్యే సినిమావాళ్లు కలసినప్పుడు ‘మీకు విశాఖలో స్థలం ఇస్తాం. సినిమా ఇండస్ట్రీని అక్కడ కూడా డెవలప్ చేయండి’ అని జగన్ అడిగారు. కాబట్టి ఆ స్థలం వెనక్కి తీసుకోరు అని అంటున్నారు. ఒకవేళ ఈ స్థలం విషయంలో సురేశ్‌బాబుకు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే.. ఆయన కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది అని అంచనాల పుకార్లు కూడా వచ్చేశాయి. దీనిపై రెండు వర్గాల నుండి క్లారిటీ వస్తే హ్యాపీ.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!