దర్శకుడు తేజ.. ఒకప్పుడు ప్రేమకథా చిత్రాలతో సంచలనం సృష్టించిన వ్యక్తి. ‘చిత్రం’ ‘నువ్వు నేను’ ‘జయం’ వంటి సినిమాలు అసాధారణమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. రాజమౌళి, వినాయక్ ల కంటే ముందే ఇతను స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయితే తర్వాత ఇతను రొటీన్ సినిమాలు తీస్తున్నాడు, హీరోని రక్తంతో తడిపేస్తున్నాడు అనే అభిప్రాయం జనాల్లో ఏర్పడింది. అయినా నిర్మాతలు తేజతో సినిమాలు చేయడానికి సందేహించడం లేదు. మరీ ముఖ్యంగా దగ్గుబాటి ఫ్యామిలీకి తేజ పై మంచి నమ్మకం ఉంది.
వెంకటేష్.. తో తేజ ఓ సినిమా చేయాల్సి ఉంది. కొంత షూటింగ్ అయ్యాక అది ఆగిపోయింది. రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమా చేశాడు. అది హిట్ అయ్యింది. దీంతో సురేష్ బాబు తన చిన్న కొడుకు అభిరామ్ ను హీరోని చేసే బాధ్యతని తేజకి అప్పగించాడు. ఈ కాంబోలో వచ్చిన సినిమా ‘అహింస’. జూన్ 2 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ లో రానాతో తన నెక్స్ట్ మూవీ ఉంటుంది అని రివీల్ చేశాడు తేజ.
అయితే (Rana) రానా.. ఒక్క హిట్టు లేకపోయినా తేజతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. కానీ గుణశేఖర్ తో చేయాల్సిన ‘హిరణ్యకసిప’ విషయంలో ఎందుకు నోరిప్పడం లేదు అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ‘నేనే రాజు నేనే మంత్రి’ కంటే ముందే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటికీ దాని సంగతేంటో తేల్చడం లేదు. గుణశేఖర్ ప్లాపుల్లో ఉన్నాడు అనే విషయాన్ని సురేష్ బాబు, రానా పట్టించుకునే వ్యక్తులు కాదు.
టాలెంట్ ను చూసి అవకాశాలు ఇస్తారు కానీ ట్రాక్ రికార్డు చూసి అవకాశాలు ఇచ్చే రకాలు కాదు వారు. రామానాయుడు గారు కూడా దీనినే ఫాలో అయ్యేవారు. సో ‘హిరణ్యకసిప’ విషయంలో ఎక్కడో ఏదో అడ్డంకి ఉంది. అది క్లియర్ అయితే సెట్స్ పైకి వెళ్ళిపోద్ది. ఆ రోజు కోసం గుణశేఖర్ తో పాటు అందరూ వెయిట్ చేయాల్సిందే.