Ravi Teja: రవితేజ… సంక్రాంతి కాదని స్పెషల్‌ డేట్‌కి వస్తున్నాడా?

ఒక హీరో సినిమా కోసం తనను తాను సిద్ధం చేసుకునేలోపే సినిమాను ఓకే చేసి, వీలైతే పూర్తి చేసేస్తుంటాడు రవితేజ. ఒకప్పుడు బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌కు ఈ పేరు ఉండేది. ఆ విషయం పక్కనపెడితే… అలా రవితేజ ప్రస్తుతం ఓ సినిమా చాలా వేగంగా పూర్తి చేస్తున్నాడు. అదే ‘ఈగిల్‌’. సంక్రాంతికి ఈ సినిమా తీసుకొద్దామని గతంలో ప్రకటించారు కూడా. అయితే ఈ సినిమా వాయిదా పడుతుంది అని తాజాగా అనుకుంటున్నారు.

సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తున్న ‘ఈగిల్‌’ సినిమాను సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్లు ఇప్పటికే టీమ్‌ ప్రకటించింది. అందుకు అనుగుణంగా జనవరి 13న ఈ సినిమాను విడుదల చేస్తామని అనౌన్స్ చేసేశార కూడా. దానికి తగ్గట్టుగానే రవితేజ వరుస షెడ్యూల్స్‌ ఈ సినిమాకే ఇస్తున్నారట. అయితే ఏమైందో ఏమో సినిమా డేట్‌ విషయంలో కొత్త పుకారు మొదలైంది.

సంక్రాంతికి ర్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ్’, విజయ్‌ దేవరకొం ‘ఫ్యామిలీ స్టార్’, తేజా సజ్జా – ప్రశాంత్‌ వర్మ ‘హను మాన్’ ఉన్నాయి. మామూలుగా అయితే వీటితోపాటు ‘ఈగిల్‌’ వచ్చేయాలి. అయితే అన్ని సినిమాల పోరు ఎందుకు అని అనుకున్నారేమో ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. అయితే టీమ్‌ నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. నిజానికి ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తామని చాలా రోజుల క్రితమే ప్రకటించారు.

ఆ మాటకొస్తే పొంగల్‌ ఫైట్‌లో ఎర్లీ డేస్‌లో నిలిచిన సినిమాగా ‘ఈగిల్‌’ను చెప్పొచ్చు. అయితే ఏమైందో ఏమో ఇప్పుడు మిగిలినవాళ్లతో పోటీ ఎందుకు, మన సినిమా మనం అనుకున్న సమయానికి తీసుకొస్తే మంచిది అని అనుకోవడం వల్లే సినిమాను వాయిదా వేసి రవితేజ పుట్టిన రోజు అయిన జనవరి 26న రిలీజ్‌చేస్తారు అని అంటున్నారు. ఇక ‘ఈగల్’ సినిమాలో రవితేజ (Ravi Teja) మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus