మూడు రోజులకు రూ. 400 కోట్లకుపైగా వసూళ్లు.. దీంతో వారానికి కనీసంలో కనీసం రూ. 700 కోట్లు పక్కా అనుకున్నారంతా. కానీ కట్ చేస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. తొలి మూడు రోజుల్లో సందడి చేసిన ‘సలార్’ ఆ తర్వాత నెమ్మదించింది. అయితే తమ సినిమా థియేటర్లలో బాగా ఆడుతోందని టీమ్ అంటోంది. ఆ విషయం పక్కనపెడితే థియేట్రికల్ వసూళ్లు సరిగ్గా లేవు అని చెప్పడానికి మరో పాయింట్ దొరికింది.
ఓ సినిమాను వేడి మీద ఉన్నప్పుడే చూస్తారు జనాలు. సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ పోయాక ఇంకా థియేటర్లలో ఉంచినా, ఓటీటీలోకి తెచ్చినా సందడి ఉండదు అంటారు. ఇప్పుడు ఇదే పాయింట్‌తో ‘సలార్’ సినిమాను ఎర్లీగా ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అంతేకాదు సంక్రాంతి సీజన్‌ను భారీగా వాడటానికి ప్లాన్ చేస్తూ జనవరి 12, 13 తేదీల్లో ‘సలార్’ను ఓటీటీలోకి తీసుకొచ్చేయానికి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయట.
ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ రూపొంది (Salaar) ‘సలార్’ సినిమా డిసెంబరు 22న థియేటర్లలో విడుదలైంది. పెద్ద సినిమాల కాన్సెప్ట్ తరహాలోనే ఈ సినిమా కూడా నెల రోజుల తర్వాతనే ఓటీటీలోకి తీసుకొస్తారని భావించారు. ఈ మేరకు జనవరి 20 తర్వాత ఓటీటీల్లో చూద్దాం అనుకుంటున్నారు కొంతమంది. అయితే ఆ డేట్‌ను ఓ పది రోజులు ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట ‘సలార్’ టీమ్. సంక్రాంతి సీజన్‌ను వాడేసే ప్రయత్నమట.
అయితే, ఈ సినిమా డైరెక్ట్‌గా తీసుకొస్తారా? లేక కొన్ని సినిమాల తరహాలో పేమెంట్ల ప్లానింగ్‌లోకి వెళ్తారా అనేది చూడాల్సి ఉంది. ఇక ఈ సినిమా వారానికి సుమారు రూ. 500 కోట్లకుపైగా వసూలు చేసింది. అన్నీ చెప్పాం అసలు విషయం చెప్పలేదు కదా. ఈ సినిమాను భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. కాబట్టి ఈ సినిమాను అందులోనే చూడగలరు. ఈ లెక్కన సబ్‌స్కిప్షన్ డేట్ చూసుకుని రీఛార్జి చేసుకోండి మరి. గెట్ రెడీ టు సీ ‘సలార్’ ఇన్ ఓటీటీ.
డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!