Samantha: సమంతను స్నేహితులు ఏమని పిలుస్తారో తెలుసా..?

ఏ మాయ చేశావె సినిమాలోని జెస్సీ పాత్రతో తెలుగు తెరకు పరిచయమైన సమంత తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. పెళ్లికి ముందు గ్లామరస్ రోల్స్ లో ఎక్కువగా నటించిన సమంత పెళ్లి తర్వాత రంగస్థలం, ఓబేబీ, యూటర్న్ వంటి విభిన్నమైన కథలతో కూడిన సినిమాల్లో నటిస్తూ అభిమానులకు మరింత చేరువవుతున్నారు. నేడు స్టార్ హీరోయిన్ సమంత పుట్టినరోజు. తొలి సినిమా హీరో నాగచైతన్యతో మనం, ఆటోనగర్ సూర్య సినిమాల్లో కూడా నటించిన సమంత చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్నారు.

పెళ్లి తరువాత చైతన్య, సమంత మజిలీ సినిమాలో నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తమిళంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన 10 సినిమాలో సమంత విలన్ రోల్ లో నటించడం గమనార్హం. సమంత రంగస్థలం సినిమాలో డీగ్లామరస్ రోల్ లో కూడా నటించారు. ఈ పాత్ర సమంత కెరీర్ కు మైలురాయిగా నిలవడం గమనార్హం. యూటర్న్ సినిమాకు సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పుకోగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది.

అయితే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా కనిపించే సమంత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో డయాబెటిస్, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడ్డారు. ఆ ఆరోగ్య సమస్యల వల్ల సమంత దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. సమంతను అభిమానులు ముద్దుగా సామ్ అని పిలుచుకుంటారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రం సమంతను యశోద అని పిలుస్తారు. ప్రస్తుతం సమంత శాకుంతలం అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus