Guna Sekhar: దిల్ రాజు పరువు తీసేసిన దర్శకుడు గుణశేఖర్.!

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మరో చిత్రం ‘శాకుంతలం’. ఇది ఒక మైథలాజికల్ అంశాలతో కూడిన చారిత్రాత్మక చిత్రం. చాలా మందికి ఈ చిత్రం కథ తెలిసే ఉండొచ్చు. శకుంతల – దుష్యంతుడు కథ ఇది. నిజానికి ఆ కథను సినిమాగా చూపించాలంటే 4 గంటల టైం పడుతుందట. కానీ ఈ చిత్రం రన్ టైం కేవలం 2 గంటల 19 నిమిషాలు మాత్రమేనట. ఇంత తక్కువ టైంలో శకుంతల – దుష్యంతుల కథను అందంగా, అద్భుతంగా చూపించబోతున్నాడట దర్శకుడు  గుణశేఖర్ .

నిజానికి ఈ చిత్రం షూటింగ్ 2022 నవంబర్లోనే కంప్లీట్ అయ్యింది. మొదట 2D మూవీగానే తీశారు. అయితే హర్షిత్, శిరీష్, దిల్ రాజు ల ప్రోత్సాహంతో ‘శాకుంతలం’ చిత్రాన్ని 3D కి మార్చారట. అందుకు ఎక్కువ బడ్జెట్ అయినా దిల్ రాజు వెనకడుగు వేయలేదట. ఈ చిత్రం పై దిల్ రాజు చూపించిన శ్రద్ధ చూసి తనకు భయమేసినట్టు గుణశేఖర్ చెప్పుకొచ్చారు. ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఇంత భారీ బడ్జెట్ పెట్టడం ఇదే మొదటిసారి అని గుణశేఖర్  చెప్పుకొచ్చారు.

(Guna Sekhar) దీంతో పక్క భాషలకు చెందిన ఫిలిం మేకర్స్ దిల్ రాజు లేడీ ఓరియెంటెడ్ సినిమాకి అంత బడ్జెట్ పెడుతున్నారు.. ‘సమంత ఆయన కూతురా?’ అని అడిగినట్టు తెలిపి దిల్ రాజు పరువు తీసేశాడు గుణశేఖర్  . ఇది ఫన్నీగానే లెండి. దిల్ రాజు ఓ సినిమా పై నమ్మకం పెట్టుకుంటే.. క్వాలిటీ విషయంలో ఆయన ఏమాత్రం తగ్గరు అని ‘శాకుంతలం’ దర్శకుడు  చెప్పుకొచ్చాడు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus