కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఓటీటీల్లో వరుస సినిమాలు వచ్చేశాయి. అదే సమయంలో వెబ్ సిరీసులూ ఓ ఊపు ఊపేశాయి. అయితే వాటిలో కామన్ పాయింట్‌గా నిలిచింది, ఓటీటీ హీరో అయ్యింది ఒక్కడే. అతనే నన్ అదర్ దేన్ సత్యదేవ్. ‘47 రోజులు’,‘ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య’, ‘గువ్వ గోరింక’ అంటూ వరుసగా సత్యదేవ్ సినిమాలు విడుదల అయ్యాయి. అన్నీ విజయాలు సాధించాయి. వీటితోపాటు కొన్ని వెబ్ సిరీస్‌లూ కూడా చేశాడు సత్యదేవ్. అవీ మంచి పేరే తెచ్చాయి.
ఓటీటీలు తీసుకొచ్చి పేరనుకోవాలో, ఇన్నాళ్లకు దక్కిన గుర్తింపు అనుకోవాలో కానీ… సత్యదేవ్‌కు ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ఏకంగా చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్‌లో ఓ మంచి పాత్ర దక్కించదనే వార్తలూ వచ్చాయి. ఈ క్రమంలో సత్యదేవ్ ‘తిమ్మరసు’ అనే సినిమా స్టార్ట్ చేశాడు. పోస్టర్లు, లుక్‌లతో సినిమా ఆసక్తికరంగా కనిపించింది. సినిమా అంతా సిద్ధమవుతోంది… విడుదల చేసేస్తాం అని నిర్మాతలు అనుకుంటుండగా కరోన సెకండ్ వేవ్ వచ్చేసింది. దీంతో విడుదల వాయిదా పడింది.
కరోనా కారణంగా చాలా సినిమాలు ఓటీటీవైపు వస్తున్నాయంటూ ఇటీవల వార్తలొస్తున్నాయి. వాటిలో ‘తిమ్మరసు’ కూడా ఒకటి అని అంటున్నారు. సినిమాను ఓటీటీకి ఇచ్చి… సత్యదేవ్‌కు ఉన్న ఓటీటీ క్రేజ్‌ను క్యాష్ చేసుకుందాం అని నిర్మాతలు అనుకుంటున్నారట. సినిమా బాగా వచ్చినప్పటికీ… ఆలస్యమైతే హిట్ సినిమాల మధ్యలో నలిగిపోయే అవకాశమూ ఉంది. కాబట్టి ఓటీటీ ద్వారా వచ్చేయడమే బెటర్ అని నిర్మాతలు భావిస్తున్నారట. అయితే మరే నిర్ణయం ఫైనల్ అవుతుందో చూడాలి.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!