Shah Rukh Khan: అదేంటి ‘జైలర్ 2’లో షారుఖ్ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?
- June 12, 2026 / 01:21 PM ISTByFilmy Focus Desk
‘జైలర్ 2’ సినిమా షూటింగ్ అయిపోయింది ఇక వచ్చే అప్‌డేట్ సినిమా ట్రైలర్, టీజర్, సినిమా రిలీజ్ డేట్లే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా మరో అప్‌డేట్ బయటకు వచ్చింది. అదే ఈ సినిమాలో అతిథి పాత్ర. ఏంటీ ఇంకా ఇందులో గెస్ట్ రోల్స్ ఉన్నాయా? ఇంకే ఇండస్ట్రీ మిగిలింది అనుకుంటున్నారా? అవును ఇంకో పాత్ర ఉంది. అయితే ఇది ఓ పాత్రకు రీప్లేస్‌మెంట్ అని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన పేరు హృతిక్ రోషన్. అవును బాలీవుడ్ గ్రీక్ గాడ్‌ని ఈ సినిమాలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందట.
Shah Rukh Khan
టైగర్ కా హుకూం.. అంటూ మరోసారి వెండితెరపై అదరగొట్టడానికి రజనీకాంత్ – నెల్సన్ దిలీప్ కుమార్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తొలి సినిమాకు మించి హైప్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు. అందుకే అతిథి పాత్రల విషయంలో పవర్ పెంచే పనిలో ఉన్నారు. ఇప్పటికే ‘జైలర్’ అతిథులు శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ సినిమాలో ఉండగా.. తమిళ సినిమా నుండి విజయ్ సేతుపతిని తీసుకున్నారు. బాలీవుడ్ నుండి షారుఖ్ ఖాన్‌ని అడిగారు అని ఆ మధ్య వార్తలొచ్చాయి.
అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో పేరు చర్చలోకి వచ్చింది. అతనే హృతిక్ రోషన్. ఇటీవలే చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా మరోసారి సెట్స్‌పైకి వెళ్లనుందట. హృతిక్ రోషన్‌పై కొన్ని సీన్స్ తెరకెక్కిస్తారట. ఈ నెల 22 తర్వాత ఆయన సెట్లోకి అడుగుపెడతారని సమాచారం. ఈ చిత్రంలో హృతిక్ పాత్రను భారీ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని సమాచారం. మరి షారుఖ్ ఖాన్ పాత్ర అలానే ఉంటుందట. లేక ఆయన స్థానంలో హృతిక్ వస్తున్నారా అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది.
తొలి ‘జైలర్’లో మోహన్‌లాల్, శివ రాజ్ కుమార్ పాత్రలకు మంచి స్పందనే వచ్చిన సంగతి తెలిసిందే. మరిప్పుడు రెండో ‘జైలర్’లో అంతకుమించిన ఎలివేషన్లు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది కోలీవుడ్ వర్గాల సమాచారం.













