Sharwanand: శర్వానంద్ సినిమాల షూటింగులు ఆగిపోయాయా?

యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) మంచి నటుడే. ఎలాంటి పాత్రని అయినా తన నటనతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లగలడు. కానీ ఈ మధ్య శర్వానంద్ సినిమాలు అన్నీ బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరుస్తూ వస్తున్నాయి. ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ వంటి సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. ‘ఒకే ఒక జీవితం’ బాగానే ఉన్నా అంతంతమాత్రంగానే ఆడింది. ‘మనమే’ సినిమా బయ్యర్స్ కి నష్టాలే మిగిల్చింది.

Sharwanand

దీంతో శర్వానంద్ (Sharwanand) మార్కెట్ ఇప్పుడు డౌన్ అయ్యింది. అతని సినిమాలకి థియేట్రికల్, నాన్-థియేట్రికల్ డీల్స్‌ నిర్మాతలు ఆశించిన విధంగా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా శర్వానంద్ డబుల్ డిజిట్ రెమ్యునరేషన్‌నే డిమాండ్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇప్పుడు శర్వానంద్ హీరోగా 3 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘నారి నారి నడుమ మురారి’ ,’లూజర్’ ఫేమ్ అభిలాష్ రెడ్డి డైరెక్షన్‌లో చేస్తున్న ‘#Sharwa36’…. సినిమాల షూటింగ్‌లు ఎప్పుడో మొదలైనా, ఇప్పటికీ పూర్తికాకపోవడం గమనార్హం. ఇందుకు కారణం ఈ సినిమాల బడ్జెట్ పెరిగిపోవడం… శర్వానంద్ మార్కెట్ డౌన్ లో ఉండటమే అని తెలుస్తుంది. ఇటీవల సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ అనే పాన్ ఇండియా సినిమాని మొదలుపెట్టాడు శర్వానంద్. 2 షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకుంది.

కానీ ఈ ప్రాజెక్టుకి కూడా ఆర్థిక సమస్యలు వచ్చి పడ్డాయట.ఈ సినిమా నిర్మాత కె.కె.రాధామోహన్ గత సినిమా ‘భైరవం’ నష్టాలనే మిగిల్చింది. దీంతో ‘భోగి’ షూటింగ్ హోల్డ్ లో పడినట్టు సమాచారం. మరి ఈ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో? చూడాలి..!

 30 ఏళ్ళ క్రితం జగపతి బాబు సినిమా విషయంలో అంత జరిగిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus