Sharwanand: ఇప్పటికే ఆ రెండేళ్ల గ్యాప్‌… ఇంకా ఎన్ని రోజులు ఇలా?

‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) అంటూ 2022లో వచ్చిన శర్వానంద్‌ (Sharwanand) మరో సినిమా చేయడానికి రెండేళ్లు పట్టింది. ఈ ఏడాదే ‘మనమే’ (Manamey) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేదు. ఆ సినిమా ఫలితం వల్లనో లేక వేరే కారణమో కానీ కొత్త సినిమాల విషయంలో జోరు చూపించడం లేదు. చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి అని అంటున్నారు కానీ వాటి సందడేమీ కనిపించడం లేదు.

Sharwanand

దీంతో శర్వా ఏం చేస్తున్నాడు, చేతిలో ఏం సినిమాలు ఉన్నాయి అనే చర్చ మొదలైంది. నిజానికి శర్వా చేతిలో రెండు మంచి ప్రాజెక్టులే. మంచి విజయం అందుకున్న దర్శకుల చేతిలో ఆ సినిమాలు పెట్టాడు శర్వ. అయితే వాటి షూటింగ్‌ అప్‌డేట్స్‌ ఇటీవల కాలంలో పెద్దగా ఏమీ రావడం లేదు. దీంతో తాజా వార్తల్లో శర్వా పేరు వినిపించడం లేదు. దీంతో శర్వా సినిమా ఎప్పుడు చర్చ మొదలైంది. వరుస సినిమాలు చేస్తున్నా సరైన విజయం రాకపోతున్న సమయంలో ‘ఒకే ఒక జీవితం’ అంటూ చిన్న సైజు ప్రయోగమే చేశాడు శర్వానంద్‌.

అది ఫలించి భారీ విజయం అందుకుంది. ప్రశంసలూ లభించాయి. దీని తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తాడు అనుకుంటే రెండేళ్లు ఆగిపోయాడు. అన్ని రోజులు ఆగి చేసిన ‘మనమే’ తేడా కొట్టేసింది. ఇప్పుడు అప్‌డేట్స్‌ చూస్తుంటే మళ్లీ పెద్ద గ్యాప్‌ వస్తుందా అనే డౌట్‌ మొదలైంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఓ సినిమా చేస్తోంది. ‘సామజవరగమన’ (Samajavaragamana) సినిమా ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర (Anil Sunkara) ఓ సినిమా అనౌన్స్‌ చేశారు.

ఈ రెండు సినిమాల షూటింగ్‌ పారలల్‌గా చిత్రీకరణ ఉంటుంది అని చెప్పారు. ఓవైపు యూవీ క్రియేషన్స్‌ సినిమా ప్రొడ్యూసింగ్‌ ప్లాన్స్‌ మారుస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. వరుస పరాజయాలే దీనికి కారణం అని అంటున్నారు. మరోవైపు అనిల్‌ సుంకర సినిమా సంగతీ తేలడం లేదు. ఇప్పటికే సమ్మర్‌ వరకు రిలీజ్‌ డేట్స్‌ తేలిపోయాయి టాలీవుడ్‌లో. ఈ నేపథ్యంలో శర్వానంద్‌ త్వరగా రిలీజ్‌ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

వెంకటేష్ బర్త్ డే స్పెషల్ : ఆ విషయంలో వెంకటేష్ ని కొట్టేవారే లేరు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus