Naga Chaitanya, Samantha: సమంత విడాకుల వెనుక కారణం ఆమేనా? పోస్ట్‌కు అర్థం అదేనా!

బోడి గుండుకు, మోకాలికి ముడివేయడం… ఇప్పటికిప్పుడు దీనికి ఉదాహరణ కావాలంటే ట్రోలర్లు అని పద్ధతిగా పేరు పెట్టుకున్న కొంతమంది నెటిజన్లు చేసే పనిని చూపిస్తే చాలు. ఎక్కడో ఏదో జరిగితే, ఎవరో ఎక్కడో ఏదో అంటే ఇంకో విషయానికి ముడిపెట్టేసి అంటున్నారు. తాజాగా ఆ సో కాల్డ్‌ నెటిజన్లు సమంత గురించి ఓ వార్తను హైలైట్‌ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆమె షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ను పట్టుకుని కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు పీకుతున్నారు.

నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకుని రెండేళ్లు దాటిపోయింది. వారు విడిపోవడానికి అసలు కారణం ఇంత వరకు తెలియదు. విడాకుల గురించి ఆమె అడపాదడపా మాట్లాడినా… పెద్దగా వివరాలు ఏమీ లేవు. అయితే మొదటిసారి దీనిపై సమంత పరోక్షంగా హింట్ ఇచ్చారు అంటూ ఓ పుకారు షికారు చేస్తోంది. సమంత పెళ్లయ్యాక బోల్డ్ సన్నివేశాలు నటించడం ఇష్టం లేని నాగ చైతన్య విడాకులు ఇచ్చాడనేది తొలి రోజుల్లో వచ్చి వెర్షన్‌.

అవి కాకుండా వాళ్లిద్దరి పర్సనల్‌ లైఫ్‌లో వచ్చిన కొన్ని మనస్పర్థలు కూడా కారణం అనేవి మిగిలిన వెర్షన్లు. అవన్నీ మనం ఇక్కడ డిస్కస్‌ చేయడం సరికాదు. అయితే ఆమె విడాకులు నిర్ణయం తీసుకోవడానికి కారణం ఈమెనే అంటూ ఓ అమ్మాయి ఫొటో గురించి మాట్లాడుతున్నారు నెటిజన్లు. సమంత లేటెస్ట్‌ సోషల్ మీడియా పోస్ట్ దీనికి కారణం అయ్యింది. మలేషియాలో ఉండే మేఘన అనే ఫ్రెండ్‌తో దిగిన ఫొటో (Samantha) సమంత షేర్ చేసింది.

ఆ ఫొటోకి ‘‘నా విలువైన నిర్ణయాలకు ఒక ముఖం అంటూ ఉంటే… అది మేఘనే’’ అని క్యాప్సన్‌గా పెట్టిది. అలా మేఘన తన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేసింది. కాబట్టి సమంత విడాకులు తీసుకోవడంలో మేఘన సలహాలు, సూచనలు ఉండి ఉంటాయి అంటూ ఎవరికి వాళ్లు వాళ్ల స్క్రిప్ట్‌లు రాసేస్తున్నారు. ఒకరి జీవితం విషయంలో కీలక నిర్ణయానికి వేరొకరికి కనెక్ట్‌ చేయడం సరికాదు అనేది మరికొందరి వాదన.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus