Hema Chandra, Sravana Bhargavi: హేమచంద్ర శ్రావణ భార్గవి విడాకులు తీసుకోనున్నారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్లుగా గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో హేమచంద్ర, శ్రావణ భార్గవి ముందువరసలో ఉన్నారు. కొత్త సింగర్ల నుంచి పోటీ ఎదురవుతున్నా హేమచంద్ర, శ్రావణ భార్గవిలకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. 2013 సంవత్సరం ఫిబ్రవరి నెలలో వీళ్లిద్దరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్న జోడీలలో హేమ చంద్ర శ్రావణ భార్గవి జోడీ కూడా ఉంది. అయితే గత కొన్నిరోజులుగా హేమచంద్ర శ్రావణ భార్గవి మధ్య మనస్పర్దలు వచ్చాయని వీళ్లిద్దరూ విడిగా ఉంటున్నారని త్వరలోనే వీళ్లు విడాకులు తీసుకోనున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అటు హేమచంద్ర ఇటు శ్రావణ భార్గవి ఈ వార్తల గురించి స్పందించకపోవడంతో కొంతమంది అభిమానులు ఈ వార్తలు నిజం కావచ్చని భావిస్తున్నారు. చైతన్య సమంత విడిపోయిన తర్వాత ఇలాంటి వార్తలు అభిమానుల్ని మరింత టెన్షన్ పెడుతున్నాయి. హేమచంద్ర, శ్రావణ భార్గవిలకు సింగర్లుగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టులుగా మంచి పేరు ఉంది. ఈ జంటకు ఒక కూతురు అని సమాచారం. వివాదాలకు దూరంగా ఉండే జోడీగా ఈ జోడీకి పేరుంది.

రైడ్ సినిమా సమయంలో వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారిందని సమాచారం. కొన్నిరోజుల క్రితం ప్రసారమైన ఒక సింగింగ్ షోలో హేమచంద్ర శ్రావణ భార్గవి కలిసి కనిపించారు. టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరును సొంతం చేసుకున్న ఈ జోడీ విడిపోకూడదని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న హేమ చంద్ర, శ్రావణ భార్గవి కలిసి పలు షోలు చేయగా ఆ షోలు బుల్లితెరపై సక్సెస్ సాధించాయి. హేమచంద్ర పలు సినిమాలకు మ్యూజిక్ కంపోజర్ గా కూడా పని చేశారు. హేమచంద్ర శ్రావణ భార్గవి నిజంగా విడిపోతున్నారో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus