దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి! తెలుగు సినిమాల్లో ఈ నానుడిని ఎక్కువగా హీరోయిన్ల గురించి మాట్లాడేటప్పుడు చెబుతుంటారు. హీరోలు దశాబ్దాల తరబడి స్టార్ స్టేటస్‌ను హోల్డ్ చేయగలరు కానీ, హీరోయిన్ల కెరీర్ మహా అయితే దశాబద్దమే అంటుంటారు. మరికొందరిది అయితే అర్ధ దశాబ్దమే. ఇందుకే తమ అందచందాలకు, నటనకు బజ్ ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేసి కావాల్సినంత పేరు, డబ్బు సంపాదించుకోవాలి. అయితే ఈ ఆలోచనలో సరైన సినిమాలు చేయకపోతే వేగంగా కెరీర్ ఇబ్బందుల్లో పడిపోతుంది.
ఒక్కోసారి అర్ధాంతరంగా ఆగిపోతుంది కూడా. గతంలో చాలామంది హీరోయిన్లు ఇలా ఏమీ ఆలోచిచంకుండా పెద్ద హీరో సినిమా, పెద్ద నిర్మాణ సంస్థ సినిమా అని ఒప్పేసుకుని ఇబ్బందుల్లో ఉన్నారు. అన్నీ ఆలోచించుకుని చేస్తే కాస్త మానసిక సంతృప్తి అయినా దొరుకుతుంది అని సెలక్టివ్ సినిమాలు చేసే నాయికలు అంటుంటారు కూడా. ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకు అంటే… శ్రీలీల గురించి. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ సినిమా తెలుగు బ్యూటీ ఓవర్ నైట్ డ్యాన్సింగ్ స్టార్ అయిపోయింది.
అమె అందం, క్యూట్‌నెస్, డ్యాన్సింగ్ టాలెంట్ ఆమెను అమాంతం స్టార్ హీరోయిన్‌ను చేశాయి. ఇటీవల కాలం వరకు పెద్ద హీరో సినిమా అని ఆలోచిస్తే హీరోయిన్‌గా ఈమె పేరే వినిపించింది. ఇప్పుడు కూడా వినిపిస్తోంది అనుకోండి. కానీ అలా వచ్చిన సినిమాలేవీ ఆశించిన ఫలితం ఆమెకు ఇవ్వడం లేదు. గతంలో ఇలాగే వరుస సినిమాలు చేసిన వాళ్లు చాలామంది ఉన్నా రీసెంట్‌గా అయితే కృతి శెట్టి, పూజా హెగ్డే లాంటి వాళ్లు కనిపిస్తారు.
రీఎంట్రీ / ఎంట్రీలోనే మంచి సినిమా చేసి వరుస ఛాన్స్‌లు సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత సరైన కథలు ఎంపిక చేసుకోలేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు శ్రీలలకు ఛాన్స్‌లు అయితే చాలా ఉన్నాయి, అందులో ఎన్ని ఆమె కెరీర్‌ను పైకి తీసుకురావడానికి ఉపయోగపడతాయి అనేది చూడాలి. లేదంటే ఆమె (Sreeleela)అయినా అలాంటి కథల్ని ఎంచుకోవాలి.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!