Jr NTR: వైరల్‌ వీడియోలోని నెంబర్‌ తారక్‌దేనా.. చెక్‌ చేస్తే!

సోషల్‌ మీడియాలో ఏదైనా వీడియో పోస్ట్‌ చేసినప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలి అని అంటారు. అందులో పర్సనల్‌ విషయాలు లాంటివి బయటకొస్తే పెద్ద సమస్య. సెలబ్రిటీలకు అయితే ఇది ఇంకా పెద్ద సమస్య. ఉదాహరణకు ఏ ఫోన్‌ నెంబరో ఆ ఫొటో/ వీడియోలో కనిపిస్తే ఇక నెంబర్‌కి కాల్స్‌ పోటెత్తుతాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌కి సంబంధించిన ఓ వ్యక్తికి ఈ అనవసరమైన కాల్స్‌ తాకి ఎక్కువైంది. దానికి కారణం ఎన్టీఆర్ చేసిన ఓ మాట సాయం.

ఓ అభిమాని అనారోగ్యం బారిన పడటంతో ఎన్టీఆర్‌ టీమ్‌ అతనికి ఫోన్‌ చేశారు. ఆ తర్వాత ఆ అభిమాని కుటుంబ సభ్యులతో తారక్‌ మాట్లాడారు. దానికి సంబంధించిన ఓ వీడియోను ఎన్టీఆర్‌ అభిమానులు, ప్రతినిధులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఆ వీడియోలో మొబైల్‌ నెంబరు కనిపించింది. దాంతో ఆ నెంబరు ఎన్టీఆర్‌దే అనుకుని ఫ్యాన్స్‌ తెగ ఫోన్లు చేసేస్తున్నారు. దీంతో ఆ నెంబరుకు చెందిన వ్యక్తి పరిస్థితి ‘శివమణి’ సినిమాలో ఎమ్మెస్‌ నారాయణలా అయిపోయింది అంటున్నారు.

ఇలాంటి వీడియోలు షేర్‌ చేసేటప్పుడు వ్యక్తిగత వివరాలు బయటకు వెళ్లకుండా బ్లర్‌ చేయడం లాంటివి చేయాలి. కానీ ఎన్టీఆర్‌ పీఆర్వో టీమ్‌ ఈ పని చేయడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత ఆ వీడియో తెగవైరల్‌ అయ్యింది. ఇప్పుడు ఎంత ఆపినా ఏమీ చేయలేని పరిస్థితి. ఇంతకీ ఆ ఫోన్‌ నెంబరు ఎన్టీఆర్‌దా అంటే కాదనే చెప్పాలి. అతని సన్నిహిత టీమ్‌ సభ్యునిదట. కాబట్టి ఆ నెంబర్‌కి కాల్స్‌ చేసి ఎన్టీఆర్‌తో మాట్లాడేద్దాం అనుకోవడం వేస్ట్‌. కాబట్టి ఆ ప్రయత్నాలు చేయొద్దు.

అయితే సోషల్‌ మీడియాలో మరో మాట కూడా వినిపిస్తోంది. ఓ అభిమాని కుటుంబానికి భరోసాగా ఎన్టీఆర్‌ చేసిన పనిని పట్టించుకోకుండా అందులోని నెంబరును మాత్రమే తీసుకొని సోషల్‌ మీడియాలో ఈ రచ్చ చేయడం అవసరమా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus