టాలీవుడ్ లో మాస్ హీరోలు ఉన్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ హీరోలు ఉన్నారు, యూత్ ఫుల్ హీరోలు కూడా ఉన్నారు. కానీ కామెడీ హీరోలు మాత్రం ప్రతీ జెనెరేషన్ కి కేవలం ఒకరు మాత్రమే ఉన్నారు. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ అయితే, నేటి తరం లో మంచి కామెడీ హీరో గా పేరు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్. ఈవీవీ సత్యనారాయణ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అల్లరి నరేష్, అద్భుతమైన కామెడీ ని పండించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
అయితే అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ ప్రారంభం లో చాలా అద్భుతంగా ఉండేది, కానీ మధ్యలో స్పూఫ్స్ చేసి తనని తాను బాగా తగ్గించేసుకున్నాడు. పక్క హీరోల హైలైట్ సన్నివేశాలను స్పూఫ్ చేస్తూ అల్లరి నరేష్ ఇది వరకు ఎన్నో సినిమాలు చేసాడు. ఇది చూసి చూసి జనాలకు బాగా విరక్తి కలిగేసింది. ఒకానొక దశలో అల్లరి నరేష్ సినిమాలకు జనాలు థియేటర్స్ కి రావడం బాగా తగ్గించేశారు. ఆయన మార్కెట్ కూడా బాగా డౌన్ అయిపోయింది. ఇది గమనించిన అల్లరి నరేష్ ‘మహర్షి’ సినిమా నుండి తన రూట్ ని మార్చాడు.
కామెడీ జానర్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి, కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ వచ్చాడు. ఫలితంగా ఆయనకీ సూపర్ హిట్స్ కూడా దక్కాయి. అయితే ఒకానొక సందర్భం లో ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి ఫోన్ చేసి, అల్లరి నరేష్ గారు , మీరు చాలా మంచి నటులు, కానీ ఆ స్పూఫ్ సినిమాలు చెయ్యడం ఆపేయండి సార్, చాలా చిరాకు పుడుతుంది అంటూ కామెంట్ చేస్తాడు. అప్పటి నుండే అల్లరి నరేష్ లో ఈ మార్పు వచ్చిందని అంటుంటారు.