Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 13, 2026 / 12:41 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విశ్వక్ సేన్ (Hero)
  • కయాడు లోహర్ (Heroine)
  • నరేష్ విజయ్ కృష్ణ, ఈశ్వరి రావు, జయకృష్ణ తదితరులు (Cast)
  • అనుదీప్ కేవీ (Director)
  • సూర్యదేవర నాగవంశీ - సాయి సౌజన్య (Producer)
  • భీమ్స్ (Music)
  • సురేష్ సారంగం (Cinematography)
  • నవీన్ నూలి (Editor)
  • Release Date : ఫిబ్రవరి 13, 2026
  • సితార ఎంటర్టైన్మెంట్ - ఫార్చ్యూన్ 4 సినిమాస్ (Banner)

“జాతిరత్నాలు” సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన నాలుగో సినిమా “ఫంకీ”. విశ్వక్ సేన్, కయాడు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. సినిమా ఇండస్ట్రీ మీద, ఇండస్ట్రీ వ్యవహారాలపైన సెటైరికల్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు *(ఫిబ్రవరి 13) విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

Funky Movie Review

Funky Movie Review and Rating

కథ: కోమల్ (విశ్వక్ సేన్) ఓ యువ దర్శకుడు, నాలుగు కోట్ల రూపాయల్లో సినిమా తీస్తాను అని నిర్మాతను నమ్మించి.. 40 కోట్లు చేస్తాడు. దాంతో స్ట్రెస్ వచ్చి మంచాన పడతాడు నిర్మాత (నరేష్). అప్పుడు రంగంలోకి దిగుతుంది నిర్మాత కూతురు చిత్ర (కయాడు). కోటి రూపాయల్లో ఉన్న సినిమా మొత్తం పూర్తి చేసి రిలీజ్ చేయాలని నిశ్చయించుకుంటుంది.

అక్కడి నుండి కోమల్-చిత్రల ప్రయాణం ఎలా సాగింది? అనేది సినిమా కథాంశం.

Funky Movie Review and Rating

నటీనటుల పనితీరు: విశ్వక్ సేన్ కొత్తగా కనిపించాడు. అనుదీప్ ని ఇమిటేట్ చేస్తున్నట్లుగా ఉన్నా.. నటుడిగా మాత్రం అలరించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే మదర్ ఎమోషనల్ సీన్ లో పరిణితి ప్రదర్శించాడు.

కయాడు అందంగా, నిండుగా కనిపించింది. లిప్ సింక్ ఇవ్వడానికి ఇబ్బందిపడినప్పటికీ.. స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించింది. కాకపోతే.. విశ్వక్-కయాడు కెమిస్ట్రీ ఎందుకో కొన్ని సన్నివేశాల్లో సెట్ అవ్వలేదు. కామెడీ మాత్రం బాగా వర్కవుట్ అయ్యింది.

నరేష్, జయకృష్ణల పాత్రలు కొంతమేరకు అలరిస్తాయి. దిల్ రాజు, హరీష్ శంకర్, నాగవంశీ, కళ్యాణ్ శంకర్ ల క్యామియోలు పర్వాలేదనిపించాయి.

Funky Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: అనుదీప్ సినిమాల్లో ఎప్పుడూ ఏదో ఒక సోషల్ సెటైల్ ఉంటుంది. “జాతి రత్నాలు” ప్రభుత్వాలు, నిరుద్యోగం, రాజకీయ నాయకుల మీద సెటైర్ అయితే.. ప్రిన్స్ విద్యా వ్యవస్థ, కుల వ్యవస్థ మీద సెటైర్. అలాగే.. “ఫంకీ” కూడా సినిమా ఇండస్ట్రీ మీద, హ్యూమన్ ఎమోషన్స్ మీద సెటైర్. అయితే.. సెటైర్ కి డ్రామా వర్కవుట్ అవ్వడం అనేది చాలా కీలకం. ఆ డ్రామా “ఫంకీ”లో లోపించింది. వరుసబెట్టి సింగిల్ లైన్ పంచులు పడుతూనే ఉంటాయి.

ఇంటర్వ్యూల్లో నాగవంశీ చెప్పినట్లు, ఒక పంచ్ ని ఎంజాయ్ చేసేలోపే మరో పంచ్ పడుతుంది. ఈ పంచుల నడుమ కథనం కూనీ అయిపోయింది. సినిమాకి కథ, కథనం కోసం రావొద్దని నాగవంశీ వారించినా, కనీస స్థాయి కథని ఎక్స్ పెక్ట్ చేయడంలో తప్పు లేదు కదా. అనుదీప్ నిజజీవిత శైలి సినిమాలోనూ కనిపిస్తుంది. ఏ విషయాన్ని పెద్దగా సీరియస్ గా ఉండదు. పాత పాటల వాడకం కానీ, రీసెంట్ సినిమాల మీద పంచులు కానీ పూర్తిస్థాయిలో వర్కవుట్ అవ్వలేదు. ఒక రచయితగా ఆకట్టుకోగలిగిన అనుదీప్, దర్శకుడిగా మాత్రం పూర్తిస్థాయిలో అలరించలేకపోయాడు.

భీమ్స్ పాటలు పర్వాలేదు అనిపించేలా ఉండగా.. నేపథ్య సంగీతం మాత్రం సినిమాలోని హ్యూమర్ & ఎమోషన్ ను ప్రాపర్ గా ఎలివేట్ చేయలేదు. నవీన్ నూలి ఎడిట్ ప్యాటర్న్ ఎందుకో కాస్త ఇబ్బందిగానే ఉంది. జంప్ కట్స్ మరీ ఎక్కువయ్యాయి. కంటిన్యూటీ ఇష్యూస్ అయితే బోలెడు.

ప్రొడక్షన్ & ఆర్ట్ వర్క్ విషయంలో మాత్రం నిర్మాత రాజీపడలేదు. సినిమాకి అవసరమైనదానికంటే ఎక్కువే ఖర్చు చేశాడు.

Funky Movie Review and Rating

విశ్లేషణ: ఒక సినిమాకి ఏం ఆశించి రావాలి అనే ఎక్సపెక్టేషన్స్ సెట్ చేయడం ఎప్పుడూ మంచిదే. అయితే.. కొంతమంది దర్శకుల సినిమాలకి ఎక్స్ పెక్టేషన్స్ తో సంబంధం లేకుండా.. కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తారు ఆడియన్స్. అందులో అనుదీప్ కచ్చితంగా ఒకడు. అనుదీప్ సినిమాలంటే సింగిల్ లైన్ పంచులు, కనీస స్థాయి సీరియస్ నెస్ లేని కథనం, సందర్భాలు ఉంటాయని ఊహించేదే.

అయితే.. కథనం, సందర్భాలు కంటే సెట్ చేసిన మూడ్ కి తగ్గట్లుగా సినిమా సాగుతుందా లేదా అనేది చాలా కీలకం. ఆ సెట్ చేసిన మూడ్ ని కంటిన్యూ చేయడంలో అనుదీప్ తడబడ్డాడు. ఆ కారణంగా “ఫంకీ” పంచులు కొన్ని సార్లు పేలకపోగా, ఇంకొన్నిసార్లు నవ్వాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో పాస్ అంటూ సైడ్ అయిపోయాయి. ఓవరాల్ గా.. “ఫంకీ” వన్ టైమ్ వాచ్ మూవీగా మిగిలింది.

Funky Movie Review and Rating

ఫోకస్ పాయింట్: అనుదీప్ మార్క్ ఫన్ కీ సినిమా!

రేటింగ్: 2.5/5

Click Here To Read in TELUGU

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anudeep KV
  • #Funky Movie
  • #Kayadu Lohar
  • #Naga Vamsi
  • #Naresh

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

25 mins ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

3 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

3 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

4 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

55 mins ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

2 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

19 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

20 hours ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version